జయమాలిని.శృంగారం నర్తకి గా, జగన్మోహినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని స్థానాన్ని సంపాదించుకున్న నర్తకి.80, 90 లలో శృంగార గీతాలు అంటే ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకమైన అభిమానముండేది.జయమాలిని వంటి నర్తకి మణి ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేయని రసిక ప్రియులు లేరంటే నమ్మండి.
అప్పట్లో కేవలం శృంగార గీతాలతోనే హిట్ అయిన సినిమాలు అనేకం ఉన్నాయి.ఒక సినిమా ఏదైనా రిలీజ్ అవ్వకుండా ఉండి ఉంటే ఒక శృంగార గీతాన్ని జోడించి విడుదల చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం కూడా ఉండేది.
అంతలా శృంగార గీతాలు సినిమాని ప్రభావితం చేసిన గోల్డెన్ డేస్ అవి.ఒక సమయంలో జయమాలిని దగ్గరికి ఒక ప్రేక్షకురాలు వచ్చి ఈ విధంగా ప్రశ్నించిందట.
జయమాలిని గారు ! మీరు శృంగార నృత్య తారగా ఇప్పుడు ఎంతో పీక్ స్టేజ్ లో ఉన్నారు.కానీ మీలో ఒక మంచి నటి కూడా ఉంది కదా అంతేకాదు మీరు ఒక అద్భుతమైన నర్తకి కూడా మరి అలాంటి నటి అయిన మీరు కేవలం ఒక క్లబ్ డాన్సర్ గా ఎందుకు ఇలా ఉండిపోయారు ? ఈ శృంగార గీతాలు ఇప్పుడు మోతాదు మించిపోయి మరి కనిపిస్తున్నాయి.మీ శృంగార గీతాలకు దర్శకులు, నిర్మాతలు మరింత ప్రోత్సాహం ఇస్తున్నారు.ప్రేక్షకుల చేత మీరు ఈలలు వేయించుకుంటున్నారు.
కానీ ఇవి చేసేటప్పుడు, మీ ఒంటి అందాలను ప్రదర్శిస్తున్నప్పుడు మీకు ఏమి ఇబ్బందిగా అనిపించడం లేదా ? ఒక స్త్రీగా మీరు బాధపడటం లేదా ? ఎలాంటి విమర్శలు రావడం లేదా ? అని నేరుగా ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు జయమాలిని దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంది.ఆమె సమాధానం ఈ విధంగా ఉంది.మీరు చెబుతున్న దాంతో నేను ఏకీభవిస్తాను.
నీ బాధ నాకు అర్థమైంది.నేను కూడా ఇండస్ట్రీకి నటించాలని, హీరోయిన్ అవ్వాలని వచ్చాను.
కానీ తొలి నాళ్లలో ఇలాంటి డ్యాన్సులు చేయడంతో, అవి హిట్టు కావడంతో నన్ను ఒక డాన్సర్ గాని అందరూ చూశారు.నా నృత్యానికి తగ్గట్టు తగ్గట్టుగా కెమెరా కూడా పనిచేస్తుంది.
అలాగే కొరియోగ్రాఫర్లు అలాంటి మూమెంట్స్ ని మాలాంటి వారి కోసం కంపోజ్ చేస్తున్నారు.మీరు అన్నట్టుగా మేము చేసే ఈ నృత్యాల వల్ల మగ ప్రేక్షకులు కచ్చితంగా ఈలలు వేస్తారు.
కానీ అవి స్త్రీలకు ఇబ్బందికరమే అవుతుంది.కానీ వాటికి నాకు ఎలాంటి బాధ్యత లేదు.
ఇలాంటి పాటలు, ఇలాంటి నృత్యాలు విమర్శలకు తావిస్తున్నప్పటికీ వాటిని ఆపవలసిన బాధ్యత నా పైన లేదు.దర్శక నిర్మాతలు వాటి గురించి ఆలోచించాలి వారు పెట్టడం ఆపాలి.
అలా పెడితేనే సినిమాలు హిట్ అవుతున్న రోజుల్లో ఉన్నాం కాబట్టి అవి పెట్టకుండా ఉంటే తప్ప నేనేమీ చేయలేను.కానీ నేను నృత్యం చేస్తున్నందుకు ఏమాత్రం బాధపడటం లేదు.
ఎందుకంటే ఒకసారి బాధపడితే రెండవ పాటలో నేను నర్తించేదాన్ని కాదు కదా అని జయమాలిని చెప్పుకొచ్చింది.