మామూలుగా ఎవరైనా అమ్మాయిలు ఇండస్ట్రీలో హీరోయిన్( Heroine ) గా అడుగుపెట్టాలని అనుకుంటారు.వారికి హీరోయిన్ అవ్వాలని కోరికలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకానీ చిన్న చిన్న ఆర్టిస్ట్ లుగా చేయడానికి మాత్రం ముందుకి అస్సలు రారు.పైగా టాలెంట్ తో పాటు అందం, మంచి పర్సనాలిటీ కూడా ఉండాలి.
బాగా గ్లామర్ గా కూడా కనిపిస్తూ ఉండాలి.అలా అయితేనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంటారు.
ఇక కొంతమంది అమ్మాయిలు వారిలో అంతా లుక్ లేకపోవటంతో చిన్న చిన్న ఆర్టిస్టులుగా చేస్తూ ఉంటారు.ఇక మరికొంతమంది నెగటివ్ షేడ్స్( Negative Roles ) లలో కూడా కనిపిస్తూ ఉంటారు.అయితే అందం పరంగా బాగున్నప్పటికీ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ పాత్రలలో నటిస్తుంది.అయితే ఈమె కూడా మొదట్లో ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అని ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.
అలా కొన్ని సినిమాల్లో చేయగా అందులో సక్సెస్ కంటే ఎక్కువ ఫ్లాప్స్ వచ్చాయి.దీంతో హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇక తనకు హీరోయిన్గా కలిసి రాదు అని నెగటివ్ పాత్రలు చేయాలి అని ఫిక్స్ అయింది.అలా నెగిటివ్ పాత్రలో నటిస్తూ హీరోయిన్స్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటుంది.
చాలామంది ఈమె అభిమానులు ఈమె చూడ్డానికి అందంగా ఉన్నప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ ఎందుకు అవడం లేదు అని తెగ అనుమానం పడుతున్నారు.అయితే ఈమె హీరోయిన్ కాకపోవటానికి ఒక రీజన్ ఉందని తెలిసింది.
ఆ విషయం కూడా స్వయంగా తానే తెలిపింది.గతంలో వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarathkumar ) ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో యాంకర్ వరలక్ష్మిని.
మీరు ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేకపోయారు.ఎక్కువగా నెగటివ్ పాత్రలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారని తెలిసింది.
దీంతో వరలక్ష్మి స్పందిస్తూ.హీరోయిన్ కావాలి అంటే గ్లామర్ పాత్రలలో బాగా పోషించాలి.గ్లామర్ పరంగా బాగా టాలెంట్ చూపిస్తూ ఉండాలి.అలా అయితేనే హీరోయిన్గా కొనసాగుతారు.లేదంటే కష్టమే అంటూ.అందుకే అటువంటి తలనొప్పులు నేను పెట్టుకోలేక నెగటివ్ పాత్రలలో చేస్తున్నాను అని తెలిపినట్లు తెలిసింది.
ఇక నిజానికి ఈమెకు హీరోయిన్ కంటే ఎక్కువగా విలన్ పాత్రలతో మంచి క్రేజ్ వచ్చింది.ఇప్పటికే ఆమె క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలలో నెగటివ్ రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.రమ్యకృష్ణ తర్వాత నెగటివ్ క్యారెక్టర్ లో అంత గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని తెగ పొగిడారు.ప్రస్తుతం ఈమె తెలుగులో మరిన్ని పెద్దపెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు( Villain Roles ) చేస్తున్నట్లు తెలిసింది.
ఇక కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో బిజీగా ఉంది.మొత్తానికి వారసత్వంగా అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కు నెగిటివ్ రోల్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.