విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా వారాహి యాత్ర..

10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర వైసీపీ పాలనతో విశాఖలో విధ్వంసం మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలి ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం వారాహి యాత్ర( Varahi yatra ) గురించి దేశం మొత్తం చెప్పుకోవాలి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా చేద్దాంపంచాయితీరాజ్ వ్యవస్థను చంపేందుకే వాలంటీర్ వ్యవస్థ విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో సమావేశంలో జనసేన అధ్యక్షులుశ్రీ పవన్ కళ్యాణ్ గారుమూడో విడత వారాహి విజయ యాత్ర పూర్తయ్యే లోపు విశాఖలో భూ కబ్జాలు ఆగాలి.ఉత్తరాంధ్ర వనరులు దోచే వారిని నిలువరించాలి.

 Varahi Yatra To Bring To Light The Irregularities Of Ycp In Visakha , Visakhapa-TeluguStop.com

పారిశ్రామిక కాలుష్య నియంత్రణ అనే అంశం మీద స్పష్టత రావాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.ఈసారి వారాహి యాత్ర గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలి.

జాతీయ మీడియా సైతం దృష్టి సారించేలా చేద్దామన్నారు.ఉత్తరాంధ్రలో జరుగుతున్న వనరుల దోపిడీ దేశం మొత్తం తెలియాలన్నారు.

వారాహి విజయ యాత్రలో భాగంగా మంత్రులు, వైసీపీ నేతల కనుసన్నల్లో కబ్జాకు గురైన భూములు.కరిగిపోతున్న ఎర్రమట్టి దిబ్బలను కచ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు.

ఇక్కడ జరుగుతోన్న దోపిడీ దేశం అంతటికి తెలిసేలా చేస్తామన్నారు.గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీల సభ్యులతో శ్రీ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) గారు సమావేశం అయ్యారు.

ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న వారాహి విజయ యాత్ర గురించి చర్చించారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గతంలో శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి.బ్యాంకులో రూ.15 లక్షలు కూడా లేని పరిస్థితుల్లో మావాళ్లు ముందుకు వెళ్లడం ఎలా సాధ్యం అని సందేహించారు.ఆ రోజు ధైర్యంగా వేసిన ముందడుగే ఈ రోజు ఇక్కడ వరకు తీసుకువచ్చింది.డబ్బుతో కాకుండా ఒక భావం మనందర్నీ కలిపింది.

జనసేనకు విశాఖ కీలకం జనసేన పార్టీకి విశాఖ చాలా కీలకమైన ప్రాంతం.విశాఖలో ప్రభుత్వం మనల్ని ఇబ్బందిపెట్టి గొడవ జరిగినప్పుడు పోలీసులు పెట్టిన ఇబ్బందులు తట్టుకుని నిలబడిన మహిళా నాయకులు, నాయకులందరినీ పేరు పేరునా అభినందిస్తున్నా.

ఆ రోజు ఘటనతో పరిపాలన చేతకాని ఈ ప్రభుత్వానికి నిలదీసేది జనసేన పార్టీ మాత్రమేనన్న విషయం అందరికీ అర్ధం అయ్యింది.ఆ బలమే ఈ రోజు ఢిల్లీ పిలిపించింది.

ఎన్డీఏలో అంతటి స్థానం దక్కడానికి కీలక మలుపు విశాఖ ఘటనే.ఈ పార్టీ ఎక్కడికీ పోదన్న విషయం ప్రజలకు అవగతం అయింది.

వైసీపీ కుటిల రాజకీయాన్ని తట్టుకుని నిలబడగలమనే మనకు ప్రజలు అంత గౌరవం ఇస్తున్నారు.ఊరికే ఆరోపణలు చేయను వైసీపీ పాలనలో విశాఖలో విపరీతమైన భూ ఆక్రమణలు, ప్రకృతి విధ్వంసం జరుగుతున్నాయి.

పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంది.ఈ అంశాల మీద ఎవరూ దృష్టి సారించడం లేదు.

నేను ఎన్నికల ముందే చెప్పాను.వీళ్లు అధికారంలోకి వస్తే కొండలు మింగేస్తారని.

నిజంగానే కొండలు మింగేశారు.మనకి రాటుతేలిన నాయకత్వం ఉంది.

భయాలు మన మనసులో నుంచి తీసేశాం.మహిళలు మిస్సవుతున్నారని చెప్పిన తర్వాత తిరుపతి వెళ్తే అధికారులు ఇబ్బందికరంగా మాట్లాడారు.

అలా ఎలా చెప్పేస్తారని ఎస్పీ అన్నారు.కేంద్రం నుంచి వచ్చిన డేటా ఆధారంగా అని బలంగా చెప్పా.

అదే విషయాన్ని కేంద్ర హోం శాఖ మొన్న పార్లమెంటులో చెప్పింది.రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారు.

నేను ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడుతా.ఊరికే ఆరోపణలు చేయడం
నాకు ఇష్టం ఉండదు.

వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడింది.పెందుర్తిలో రుజువయ్యింది, వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగ సమస్య కాదు.

పంచాయితీ రాజ్ వ్యవస్థను చంపేయడానికి సృష్టించిన ఒక సమాంతర వ్యవస్థ.ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావన పెందుర్తిలో వాలంటీర్ పెద్దావిడను హత్య చేసిన విషయం నన్ను బాగా కదలించింది.

వారి కుటుంబాన్ని వారాహి యాత్రలో భాగంగా కలుద్దాం.యాత్రలో మంత్రులు చేసిన భూకబ్జాలను పరిశీలిద్దాం.

పారిశ్రామిక కాలుష్యం, ఎర్రమట్టి దిబ్బలు అయితే కచ్చితంగా చూడాలి.రుషికొండ లాంటి అంశాలు రాష్ట్రం మొత్తం తెలియాలి.

గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంటు తదితర అంశాల మీద ముందుకు వెళ్దాం.డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ అంశంలో మనం లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సబబుగా అనిపించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలు రోడ్ల మీదకు వస్తే కేంద్రం ఖచ్చితంగా పరిశీలిస్తుంది.అంత మొండి నిర్ణయాలు తీసుకోదు.

మన వరకు స్టీల్ ప్లాంట్ అంశం మీద ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి అడుగుతున్నాం.గంగవరం నుంచి మత్స్యకారులు వచ్చారు.

గంగవరం పోర్టు అదాని నిర్వహణ కు వెళ్ళినపుడు వారికి మెయిన్ పోర్టులో ఉద్యోగాలు ఇవ్వలేదు.అందర్నీ సాధ్యమైనంతవరకు ప్రత్యక్షంగా కలుసుకుందాం.

చైల్డ్ ట్రాఫికింగ్ లో రాష్ట్రానికి మూడో స్థానంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉంది.అలాగే మహిళలు, ఆడ పిల్లల అదృశ్యంపై ఎన్సీఆర్బీ డేటాని కేంద్రం సీరియస్ గా తీసుకుంది.

భీమిలి ఇంచార్జి శ్రీ సందీప్ తన నియోజకవర్గం భీమన్నదొరపాలెం గ్రామంలో జరిగిన సంఘటన నా దృష్టికి తీసుకువచ్చారు.అలాగే నోబెల్ శాంతి బహుమతి విజేత శ్రీ కైలాస్ సత్యర్ధి, మరో ఎన్జీవో తో కలసి రూపొందించిన నివేదికలో అత్యధిక చైల్డ్ ట్రాఫికింగ్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ త్రీలో ఉంది.2021-22 మధ్య కాలంలో 210 చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని వారు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది.బయటికి చెప్పుకోలేక తమ బిడ్డల్ని స్కూళ్లు మాన్పించేస్తున్న పరిస్థితి ఉంద”ని అన్నారు.

విశాఖలో ఈ నెల 10 నుంచి వారాహి విజయయాత్ర మూడో దశ : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖపట్నంలో మొదలవుతుంది.ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుంది.

యాత్రలో భాగంగా రెండు బహిరంగ సభలు, ఒక జనవాణి, ఆరు క్షేత్రస్థాయి పర్యటనలతోపాటు పార్టీ నాయకులతో నాలుగు సమావేశాలు ఉంటాయి.ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన యాత్ర అద్భుతంగా జరిగింది.

ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ప్రభుత్వ అరాచకాలు ఎండగడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉపన్యాసాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

అధ్యక్షుల వారు ఒక సమస్య గురించి మాట్లాడే ముందు ఎంతో లోతుగా అధ్యయనం చేస్తారు.సమస్య పరిష్కారానికి నిపుణులు, మేధావులతో చర్చిస్తారు.

సమస్యను పరిష్కరించడానికి శత విధాల ప్రయత్నిస్తారు.వారాహి విజయయాత్ర తొలి రెండు విడతలు దిగ్విజయం చేయడానికి స్థానిక నాయకులతోపాటు జన సైనికులు, వీరమహిళలు, వారాహి యాత్ర కోసం వేసిన కమిటీలు చాలా కష్టపడ్డాయి.

వాళ్లందరికి అభినందనలు” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube