వివాదాల ద్వారా వార్తల్లో ఎక్కువగా నిలిచే సెలబ్రిటీలలో వనితా విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) ఒకరనే సంగతి తెలిసిందే.మళ్లీ పెళ్లి సినిమాలో( Malli Pelli Movie ) వనితా విజయ్ కుమార్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వనిత షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.నేను చాలా ఎమోషనల్ అని ఆమె కామెంట్లు చేశారు.
ఏజ్ అనేది నంబర్ మాత్రమే అని నేను ఒప్పుకోనని వనిత తెలిపారు.
నేను గ్లామరస్ రోల్స్ లో కూడా నటించగలనని ఆమె అన్నారు.
మమ్మీ ట్రెడిషనల్ గా ఉండాలని కోరుకున్నారని ఆమె అన్నారు.మళ్లీ పెళ్లిలో రమ్య రఘుపతి పాత్ర( Ramya Raghupati ) నేను చేయలేదని వనిత అన్నారు.
నా జీవితంలో కొన్ని విషయాలు జరిగాయని ఎవరి పనులు వాళ్లు చూసుకోవాలని అవతలి వ్యక్తుల జీవితంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేశారు.నేను కథ కూడా అడగకుండా ఈ సినిమాలో నటించానని వనిత అన్నారు.

నాకు తెలుగు చదవడం రాదని ఆమె పేర్కొన్నారు.కొంతమంది మాత్రమే జెన్యూన్ గా సంతోషంగా ఉన్నారని వనిత చెప్పుకొచ్చారు.మళ్లీ పెళ్లిలో నా జీవితంలో ఉన్న ఘటనలు సైతం ఉన్నాయని అనిపించిందని ఆమె తెలిపారు.ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్లు ఎందుకు విడిపోతున్నారని వనిత అన్నారు.లాక్ డౌన్ సమయంలో నా లైఫ్ లో కూడా డ్రామా జరిగిందని ఆమె తెలిపారు.

నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని వనిత తెలిపారు.పాల్ ను పెళ్లి చేసుకుందామని అనుకున్నానని తర్వాత మనస్పర్ధలు వచ్చాయని ఆమె తెలిపారు.నాకు తల్లి నుంచి సపోర్ట్ దక్కిందని తండ్రి సపోర్ట్ దక్కలేదని వనిత పేర్కొన్నారు.
నేను కామెంట్స్ ను పట్టించుకోనని వనిత అన్నారు.మా సిస్టర్స్ కు డాడీ హీరో అని నాకు మాత్రం కాదని ఆమె తెలిపారు.
తమిళనాడులో కాలు తీసి నువ్వు పెట్టలేవని నాన్న వార్నింగ్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.







