వనిత విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) …సంచలన నటి అని చెప్పిన కూడా చాల తక్కువే.పెళ్లిళ్ల విషయంలో, తండ్రితో గొడవల విషయంలో ఆమె తర్వాతే ఎవరైనా.
గొడవ పాడటానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వనిత పేరు చెప్పుకోవచ్చు.ప్రముఖ నటి మంజుల( Actress Manjula ) మరియు నటుడు విజయ్ కుమార్ ల కుమార్తె అయినా మంజుల కూడా నటీమణి కావడం విశేషం.
అయితే ఆమె చాల చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అనేక తప్పటడుగులు వేసింది.మొదటి పెళ్లి ఆ తర్వాత విడాకులు, రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి అంటూ ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయ్.
వీటి సంగతి కాసేపు పక్కన పెడితే వనిత( Vanita ) తన సోదరి అయినా శ్రీదేవి( Sridevi ) పెళ్లి తన వల్లే జరిగిందని కానీ నేడు ఆ విషయం మర్చిపోయి అందరు తన కుటుంబ సభ్యులు తనను బ్లాక్ చేసారని, ఫోన్ నంబర్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా శ్రీదేవి తనను బ్లాక్ చేసేంత తప్పు తానేమి చేయలేదని చెప్తుంది.వనిత విజయ్ కుమార్ రెండవ భర్త అయినా ఆనంద్ జయరంజన్( Anand Jayaranjan ) యొక్క ప్రాణస్నేహితుడు యొక్క చుట్టాల అబ్బాయి ఈ రాహుల్ అని అతడి యొక్క గుణగణాలు తెలిసి మంచి వ్యక్తి అని తన సోదరి అయినా శ్రీదేవి తో సంబంధం తానే కుదిర్చానని, మొదట్లో సినిమా వారిని చేసుకోవడానికి రాహుల్ కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోతే శ్రీదేవి అందరి లాంటి అమ్మాయి కాదని, ఆమె చాల మంచి వ్యక్తి అని చెప్పి తానే అందరిని ఒప్పించి దగ్గర ఉండి అన్ని చూసుకొని పెళ్లి చేసానని వనిత ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపింది.
తనకు అంతా మంచి భర్త మరియు కుటుంబం ఇచ్చినందుకు శ్రీదేవి సైతం మొదట్లో తనకు థాంక్స్ చెప్పేది, మొదటి పెళ్లి రోజు నాడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా తనకు ఈ పెళ్లి చేసింది వనిత అని, అందుకే ఆమెకు థాంక్స్ అంటూ పోస్ట్ కూడా పెట్టిందని, కానీ నేడు ఆస్తుల పంపకాలు జరిగి అందరు సంతోషంగా ఉన్నారని, తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా తన తండ్రి తనను ఇంట్లో నుంచి గెంటేసాడని, పైగా శ్రీదేవి నన్ను అన్ని అకౌంట్స్ లో బ్లాక్ చేసింది అని తెలిపింది.