సలార్ లో సెకండ్ హీరోయిన్ గా వాణీ కపూర్

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఫ్యాన్ ఇండియాలో సలార్ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో నడుస్తుంది.కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఉంది.

అలాగే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ చేస్తున్న మరో యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా సలార్ తెరకెక్కతూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి దించుతున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని టాక్.ఈ నేపథ్యంలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.

Advertisement

గతంలో ఈ భామ తెలుగులో నేచురల్ స్టార్ నాని ఆహా కళ్యాణం అనే మూవీలో నటించింది.అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.దాని తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా ఈ భామకి రాలేదు.

ఇప్పుడు సలార్ లాంటి పాన్ ఇండియా మూవీ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటించిన అవకాశాన్ని సొంతం చేసుకోవడం విశేషం.హీరోయిన్ గా వాణీకపూర్ ఎంపిక విషయాన్ని త్వరలో చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

Advertisement

తాజా వార్తలు