విజయవాడ: వంగవీటి మోహనరంగా 76వ జయంతి.రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ.
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన నేతలు పోతిన వెంకట మహేష్, రామకృష్ణ, అక్కల గాంధీ.కేక్ కట్ చేసి రాధా రంగ మిత్ర మండలి సభ్యులు కు తినిపించిన వంగవీటి రాధాకృష్ణ.
వంగవీటి రాధాకృష్ణ కామెంట్స్.నా తండ్రి రంగాను కులం, మతం పార్టీలు కు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారు.
ఒక మనిషి భౌతికంగా దూరమైనా కొన్ని తరాలకు స్పూర్తి ఇచ్చారు.నేటికీ రంగాను దేవుడిగా ఆదరించడం .ఆయన చేసిన మంచిని చెబుతుంది.భవిష్యత్తు లో రంగా అభిమానులు అందరూ ఐకమత్యం చూపాలి.
రంగా పేరు చెప్పుకుని నాయకులుగా ఎదిగారు.వారు పట్టించుకోక పోయినా.ప్రజల మనసుల్లో రంగా ఉన్నారు.రంగా పేరు చెప్పుకునే పాలకులే ఆయన పేరు జిల్లాకు ఎందుకు పెట్ట లేదో చెప్పాలి.1987లో మా నాన్న చైతన్య రధం సినిమా నిర్మించారు.అభిమానులు ఎంతోకాలం గా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక ప్రింట్ దొరికితే దానిని సరి చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించాం.ఈరోజు రంగా జయంతి సందర్భంగా అమెరికా లో రిలీజ్ చేశారు.
సాంకేతిక అంశాలు పూర్తి చేసుకుని త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో కి తెస్తాం.లాభాపేక్ష లేకుండా సోషల్ మీడియా లో ఉచితంగా సినిమాను అందరూ చూసేలా చేస్తాం.







