అభిమానుల గుండెల్లో వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచిపోయాడని కాపు నేత వంగవీటి రాధా అన్నారు.రాజోలు లోని గాంధీ సెంటర్ లో రంగా అభిమానులు నెలకొల్పిన రంగా విగ్రహాన్ని రాధా ఆవిష్కరించారు.
కులం పేరుతో పదవులు పొందిన కొంత మంది నాయకులు అదే కులాన్ని తిట్టడం దారుణం అన్నారు.ఒక స్పష్టమైన ద్యేయంతో పోరాటం సాగిస్తే అది లక్ష్యాన్ని సాదిస్తుందని అన్నారు.
ఎన్నిసార్లు గెలిచామన్నది ముఖ్యం కాదని.ప్రజా మన్నన పొందామన్నదే ముఖ్యం అన్నారు.
అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి రాధా పూలమాల వేసి నివాళులర్పించారు.