వంశీ పైడిపల్లి( Vamshi Paidipally ) టాలీవుడ్ లోనే దర్శకుడిగా మంచి మార్కు చూపించారు.2007లో ప్రభాస్ హీరోగా మున్నా( Munna Movie ) అనే చిత్రంతో తొలిసారిగా దర్శకుడిగా మారాడు వంశీ.ఈ 17 ఏళ్ల కాలంలో వంశీ పైడిపల్లి కేవలం 6 సినిమాలు మాత్రమే తీశాడు.ఈ 44 ఏళ్ల దర్శకుడు మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా( Software Engineer ) పనిచేశాడు.
పుట్టింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో కాగా, చదువు మొత్తం హైదరాబాద్లోనే కొనసాగింది.మంచి జీతం మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ వంశీ ఆలోచన సినిమా ఇండస్ట్రీ పైకి( Cinema Industry ) వచ్చింది మరి మొదటి నుంచి ఇప్పటి వరకు వంశీ పైడిపల్లి ని వెనక నుంచి నడిపించిన ఆ వ్యక్తి ఎవరు ? ఎలా ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం.
అయితే వంశీ దర్శకుడుగా కన్నా ముందు దిల్ రాజు( Dil Raju ) దగ్గర ఫైనాన్స్ వ్యవహారాలు చూసే పనిలో ఉండేవాడు.సినిమాలకు కావాల్సిన డబ్బును అందించే పని అలాగే లెక్కలు చూసుకోవడం వంటివి చేసేవాడట.వంశీ పైడిపల్లి కి మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రావాలని దర్శకత్వం చేయాలని అనుకునేవాడట ఇదే విషయాన్ని దిల్ రాజుతో చెప్పడంతో ఆయన కూడా అందుకు ఓకే అన్నాడు.అయితే అనుభవం లేకుండా సినిమా ఇవ్వడానికి దిల్ రాజు ఒప్పుకోలేదట.
అప్పుడే బోయపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ భద్ర( Bhadra Movie ) అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు దిల్ రాజు.
దాంతో బోయపాటి( Boyapati Srinu ) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయమని వంశీకి సూచించాడట.ఆ తర్వాత మున్న సినిమా తానే రాసుకొని దిల్ రాజుకు చెప్పగానే అందుకు ఓకే అని ప్రొడ్యూసర్ గా ప్రభాస్ తో( Prabhas ) వంశీ నీ పెట్టి సినిమా తీశాడు.అప్పటి నుంచి ఇప్పుడు చివరిగా తీసిన వారిసు సినిమా వరకు దిల్ రాజు వంశీ చిత్రాలకు ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాడు.
మున్నా పరాజయం పాలైనా కూడా దిల్ రాజు వంశీని నమ్మాడు.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బృందావనం సినిమా( Brindavanam ) తీసి హిట్టు కొట్టాడు వంశీ.
దీనికి కూడా దిల్ రాజు నిర్మాత.
అలాగే ఆ తర్వాత రామ్ చరణ్ తో ఎవడు అనే సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాతగా ఉండగా వంశీ డైరెక్షన్ చేశాడు.ఆ తర్వాత వచ్చిన ఊపిరి సినిమాకు మాత్రం దిల్ రాజు కాకుండా వేరే వారికి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చాడు వంశీ.ఆ తర్వాత వచ్చిన మహేష్ బాబు మహర్షి( Maharshi ) చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నాడు.
ఇక తమిళ్లో విజయ్ తో వారిసు( Varisu ) అనే సినిమాకి కూడా వంశీ దర్శకత్వం వహిస్తే దిల్ రాజు నిర్మాతగా ఉన్నాడు.ఇలా వంశీ పైడిపల్లి ప్రతి చిత్రానికి దినరాజు నిర్మాతగా ఉండి అతడిని స్టార్ డైరెక్టర్ గా మార్చాడు.