ఒకప్పటి కమెడియన్ వడివేలు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వడివేలు ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.
చాలా గ్యాప్ తర్వాత కమెడియన్ వడివేలు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వడివేలు నాయి శేఖర్ రిటర్న్స్,చంద్రముఖి 2, మామన్నన్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ఒక విషయంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన వివాహం ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.
కొన్ని ఏళ్ళ క్రితం వడివేలు ఇమ్‌సై అరసన్ 23 పులికేసి సినిమాలో నటించాడు.అది భారీ విజయం సాధించడంతో పాటు ఆయన ఇమ్ సై అరసన్ 24వ పులికేలి లో నటించడానికి సంతకం చేశాడట.
అందుకోం నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.కానీ షూటింగ్ ప్రారంభం కాగానే వడివేలు చాలా ఇబ్బందులు పెట్టి సినిమాను సగంలోనే వదిలేశాడట.
దాంతో అడ్వాన్స్ తిరిగివ్వమని నిర్మాతలు అడిగితే, ఇచ్చేందుకు నిరాకరించాడట.దీంతో అది పెద్ద వివాదానికి దారితీసింది.అయితే ఇప్పటికీ కొన్ని వేలు గడుస్తున్నా కూడా వడివేలు ఆ డబ్బులను తిరిగి ఇవ్వలేదు.పైగా ఆ డబ్బులను అడుగుతుంటే బయట పెద్ద పెద్ద మనుషులు తెలుసు అంటూ బహిరంగంగా బెదిరిస్తున్నాడట.
ఈ విషయాన్ని మీడియా ముందు వాపోయి బాధపడుతున్నారు నిర్మాతలు.అయితే వడివేలు అహంకారపు విధంగా మాట్లాడడానికి కారణం ప్రస్తుతం ఉదయనిది స్థానంతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు.
అయితే అంతకుముందే ఆయన డిఎంకే పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు.అయితే డబ్బులు ఇచ్చే సినిమాలో నటించమని అడిగితే అందుకు నిరాకరించడమే కాకుండా డబ్బులు ఇవ్వనని బెదిరిస్తున్నాడని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ నిర్మాతలు తల పట్టుకుంటున్నారు.