పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh).పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఎందుకంటే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు కూడా ఈ కాంబో ఏ రేంజ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో పవర్ స్టార్ పోలీస్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.ఏప్రిల్ 5న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.మరి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా విజయ్ దళపతి బ్లాక్ బస్టర్ తేరి సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈమె సెట్స్ లో కూడా జాయిన్ అయ్యింది.ఇక ఈమె హీరోయిన్ గా నటిస్తుంది అని ఫ్యాన్స్ సైతం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ హరీష్ శంకర్ ను ఒక కోరిక కోరారు.ఈ సినిమాలో పవన్ అండ్ శ్రీలీల ( SreeLeel a) తో పర్ఫెక్ట్ మాస్ నంబర్ ప్లాన్ చేయమని అభిమానులు ట్విట్టర్ లో హరీష్ ను అడిగారు.
మరి ఈ కోరికకు హరీష్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.ఓకే అన్నట్టు థంబ్స్ అప్ ఎమోజీ వాడారు.దీంతో వీరిద్దరి మధ్య మాస్ నంబర్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చుస్తునాన్రు.ఇటీవలే ధమాకాలో ఈ అమ్మడి మాస్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉందో అందరు చూసారు.
మరి ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఉండేలా హరీష్ ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.