పవన్ – శ్రీలీల మధ్య మాస్ నెంబర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustaad Bhagat Singh).

పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఎందుకంటే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు కూడా ఈ కాంబో ఏ రేంజ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

"""/" / అంతేకాదు ఈ సినిమాలో పవర్ స్టార్ పోలీస్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

ఏప్రిల్ 5న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.మరి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా విజయ్ దళపతి బ్లాక్ బస్టర్ తేరి సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. """/" / ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈమె సెట్స్ లో కూడా జాయిన్ అయ్యింది.ఇక ఈమె హీరోయిన్ గా నటిస్తుంది అని ఫ్యాన్స్ సైతం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ హరీష్ శంకర్ ను ఒక కోరిక కోరారు.ఈ సినిమాలో పవన్ అండ్ శ్రీలీల ( SreeLeel A) తో పర్ఫెక్ట్ మాస్ నంబర్ ప్లాన్ చేయమని అభిమానులు ట్విట్టర్ లో హరీష్ ను అడిగారు.

"""/" / మరి ఈ కోరికకు హరీష్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

ఓకే అన్నట్టు థంబ్స్ అప్ ఎమోజీ వాడారు.దీంతో వీరిద్దరి మధ్య మాస్ నంబర్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చుస్తునాన్రు.

ఇటీవలే ధమాకాలో ఈ అమ్మడి మాస్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉందో అందరు చూసారు.

మరి ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఉండేలా హరీష్ ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.