ఈ అందమైన స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌తో మీ ఇంటిని మరింత అందంగా మార్చుకోండి!

స్మార్ట్ యుగంలో మనిషి స్మార్ట్ గా థింక్ చేయకపోతే ముందుకెళ్లడం చాలా కష్టం.అందుకేనేమో మార్కెట్లో రకరకాల స్మార్ట్ వస్తువులు దర్శనమిస్తూ వున్నాయి.

 Useful Electronic Smart Gadgets For Home Details, Smart Gadgets, Smart Solar Lig-TeluguStop.com

వాటిని మీమీ ఇళ్లల్లో వాడితే మీరు ఆటోమేటిక్ గా స్మార్ట్ అయిపోతారు మరి.ఇపుడు అలాంటి స్మార్ట్ గాడ్జెట్స్ కి( Smart Gadgets ) మంచి గిరాకీ ఉందండోయ్.అవును, తక్కువ ధరలోనే మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకొనే గ్యాడ్జెట్స్ కొన్ని ఇపుడు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ షాపింగ్ ఫ్లాట్‌ఫామ్‌ వేదికల ద్వారా కొనుగోలు చేయొచ్చు.అలాంటి గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేద్దామా?

Telugu Gadgets, Smart Gadgets, Smart, Smart Solar, Smart Wifi, Tech, Wireless-La

ముందుగా ఇక్కడ స్మార్ట్ సోలార్‌ లైట్( Smart Solar Light ) గురించి చెప్పుకోవాలి.కరెంటుతో పనిలేకుండా కేవలం సూర్య కిరణాలతో పనిచేసే ఈ లైట్ ఇది.కేవలం రూ.400కే లభించే ఈ గ్యాడ్జెట్‌లో 2000 mAh బ్యాటరీ ఉంటుంది.ఔట్‌ డోర్‌ లైటింగ్‌ కోసం, అలాగే ఇంటిలో కరెంట్ లేనపుడు ఈ లైట్‌ను వినియోగించుకోవచ్చు.

అదేవిధంగా ఎలక్ట్రిక్‌ క్యాండిల్స్‌( Electric Candles ) ఇపుడు మనకు లభిస్తున్నాయి.అచ్చం కొవ్వొత్తుల్లాగే కనిపించే ఈ విద్యుత్‌ క్యాండిల్స్‌ను రిమోట్‌ సాయంతో ఆపరేట్‌ చేయొచ్చు.ప్రత్యేక సందర్భాల్లో అలంకరణార్థం వీటిని వినియోగించుకోవచ్చు.

Telugu Gadgets, Smart Gadgets, Smart, Smart Solar, Smart Wifi, Tech, Wireless-La

స్మార్ట్‌ వైఫై ఎక్స్‌టెన్షన్‌( Smart WiFi Extension ) గురించి విన్నారా? వీటి ద్వారా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి చాలా తేలికగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.అలాగే 3 యూఎస్‌బీ-ఏ పోర్ట్స్, ఒక యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్‌ ఇందులో ఉంటాయి.అటు సాధారణ ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లా వినియోగిస్తూనే.

మరోవైపు వైఫై ఎక్స్‌టెన్షన్‌లానూ దీనిని వాడుకోవచ్చు.దీన్ని స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఆపరేట్‌ చేయొచ్చు.

ఇక చివరగా ఇక్కడ వైర్‌లెస్‌ క్యాబినెట్ లైట్‌( Wireless Cabinet Light ) గురించి తప్పక మాట్లాడుకోవాలి.బ్రైట్‌లైట్‌తో వచ్చే ఈ లైట్‌లో టచ్‌ సెన్స్‌, మోషన్ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

చీకటిగా ఉండే వార్డ్‌బోర్డ్‌ లాంటి ప్రదేశాల్లో దీన్ని వాడుకోవచ్చు.దీన్ని అమర్చిన చోటుకు వెళ్లగానే ఆటోమెటిక్‌గా లైట్ ఆన్‌ అవుతుంది.

ఈ లైట్ 1100mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube