అమెరికా : గ్రీన్ కార్డ్ ల జారీ పై సంచలన నిర్ణయం...!!

పెద్దన్న అమెరికా ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవసరమయ్యే గ్రీన్ కార్డ్స్ జారీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

 Us To Make It Easier For Immigrants To Get Green Cards,green Card,us Citizenshi-TeluguStop.com

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను అందుబాటులో ఉండే గ్రీన్ కార్డ్స్ కోటాను ఎలాంటి పెండింగ్ లేకుండా మొత్తం వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్టుగా ప్రకటించింది.పూర్తి వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో ఏళ్ళ తరబడిగా ఎన్నారైలు శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా భారతీయ ఎన్నారైలు ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు.

అయితే వీటి జారీ విషయంలో ఎప్పటికప్పుడు ఎన్నారైలు పెదవి విరుస్తూనే ఉన్నారు.ఎందుకంటే ప్రతీ ఏటా అమెరికా ఇచ్చే గ్రీన్ కార్డ్స్ జారీ విషయంలో ఎలాంటి అలసత్వం జరిగినా, లేదా ఉన్న వాటికంటే తక్కువ కార్డ్స్ జారీ అయినా సరే మిగిలినవి నిరుపయోగం అవుతాయి.2021 సమయంలో ఉన్నటువంటి గ్రీన్ కార్డ్స్ కోటాలో కొంత మేర మాత్రమే కార్డ్స్ జారీ కాగా సుమారు 65 వేల గ్రీన్ కార్డ్స్ ఎవరికి జారీ కాకపోవడంతో ఉపయోగం లేకుండా పోయాయి.దాంతో మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గాను

అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కీలక ప్రకటన చేసింది.

పటిష్టమైన ప్రణాళికతో ఈ సారి ఎలాంటి ఇబ్బందులు అయినా సరే అధిగమిస్తూ పూర్తి స్థాయిలో 2022 కు గాను జారీ కావాల్సిన అన్ని గ్రీన్ కార్డ్స్ కోటాను భర్తీ చేస్తామని తెలిపింది.సెప్టెంబర్ 30 సమయానికి సుమారు 2.81 లక్షల ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్స్ జారీ అవుతాయని అందుకు ప్రణాళిక సిద్దంగా ఉందని తెలిపింది.కాగా ఈ ప్రకటనపై అమెరికా ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.

పూర్తి స్థాయిలో జారీ ప్రక్రియ చేపట్టడం సాధారమైన విషయం కాదని, అందుకు ఎంతో మంది శ్రమించాల్సి ఉంటుందని అన్నారు.ఈ క్రమంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఒక క్రమ పద్దతిలో గ్రీన్ కార్డ్స్ జారీ జరగడం లేదని, ఈ సారి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యతను ఇచ్చేలా చేయమంటూ విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube