Donald Trump : జనవరి 6 కాపిటల్ అల్లర్ల ఘటన : ట్రంప్ ఇమ్యూనిటీ దావాపై అమెరికా సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలపై జరుగుతున్న నేర పరిశోధనలో ప్రాసిక్యూషన్ నుంచి తనకు సంపూర్ణ మినహాయింపు (ఇమ్యూనిటీ) వుందని పేర్కొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పిటిషన్‌ను విచారించనున్నట్లు బుధవారం యూఎస్ సుప్రీంకోర్ట్( US Supreme Court ) ప్రకటించింది.

ఈ నిర్ణయం 2024 ఎన్నికల తర్వాత విచారణను ఆలస్యం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డీసీ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి ఏప్రిల్ 22న మౌఖిక వాదనలను కోర్ట్ షెడ్యూల్ చేసింది.న్యాయస్థానం ఈ నెల ప్రారంభంలో ఒక తీర్పులో ట్రంప్ ఇమ్యూనిటీ హక్కును( Trump Immunity Claim ) గట్టిగా ఖండించింది.

మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసు సుప్రీంకోర్ట్ తుది తీర్పు ఇచ్చే వరకు నిలిపివేయబడుతుంది.నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ విచారణను ఎదుర్కొంటారా లేదా అనే దానిపై రాజకీయంగా సున్నితమైన పరిస్ధితిని ప్రభావితం చేస్తుంది.ఫెడరల్ 2020 ఎన్నికల కేసులో ట్రంప్.

అమెరికాను మోసం చేయడానికి కుట్ర పన్నారని, ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ధృవీకరణను అడ్డుకోవడానికి యత్నించారని ఆరోపించారు ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్.( Special Counsel Jack Smith ) వాషింగ్టన్ డీసీలో( Washington DC ) ట్రంప్ నాలుగు నేరారోపణనలకు పాల్పడటంతో పాటు హక్కులను ఉల్లంఘించారని పేర్కొన్నారు.ట్రంప్ గతేడాది ఈ ఆరోపణలను తోసిపుచ్చడానికి ప్రయత్నించారు.52 పేజీల పత్రంలో తనను ప్రాసిక్యూట్ చేయడం సాధ్యం కాదని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

Advertisement

2020 ఎన్నికల ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు.తన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై( Mike Pence ) ఒత్తిడి చేయడం , బైడెన్ విజయంపై కాంగ్రెస్ సర్టిఫికేషన్‌ను ఆపడం , నకిలీ ఓటర్లను సృష్టించడం వరకు వివరించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు.ట్రంప్ లీగల్ టీమ్ మాత్రం .మాజీ అధ్యక్షుడు ఇమ్యూనిటీకి అర్హుడని పేర్కొంది.ఈ వాదనలను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి తాన్యా చుట్కాన్.

డీసీ సర్క్యూట్‌ కోర్ట్‌లోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు