భారతీయ విద్యార్థులు( Indian Students ) విదేశీ విద్యకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు మొదటగా ఎంచుకునే గమ్యస్థానం అమెరికానే.అవును, ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం ఏటా లక్షల సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికా( America ) వెళుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా విద్యార్థి వీసాలు( US Student Visa ) హాట్ కేకుల్లా అయిపోతున్నాయి.తాజాగా హైదరాబాద్ ఢిల్లీ అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ (స్లాట్లు) తేదీలు విడుదల చేసిన గంటల్లోనే భర్తీ అయిపోవడం నిర్వాహకులను షాక్ చేసింది.
ఢిల్లీ మరియు హైదరాబాద్ లో వీసా కోసం ఇంటర్వ్యూ తేదీలు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే స్లాట్లు భర్తీ కావడం విశేషం.భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఫాల్ సీజన్ అనే ఆగస్టు, సెప్టెంబర్లో వెళ్తుంటారు.ఈ నేపథ్యంలో తొలి విడతగా చెన్నై కోల్ కతా ఢిల్లీ ముంబై హైదరాబాద్ ల్లోని అమెరికా కార్యాలయాల్లో వీసా స్లాట్లు విడుదలయ్యాయి.దీంతో భారతీయ విద్యార్థులు వీటి కోసం ఎగబడ్డారు.
అందువలన, ఢిల్లీ హైదరాబాద్లో వున్న నిర్దేశిత స్లాట్లన్నీ పూర్తిగా అయిపోయాయి.కాగా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భాగంగా భారతీయ విద్యార్థులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో హైదరాబాద్ ఢిల్లీల్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా స్లాట్లను విడుదల చేసిన 3 గంటల్లోనే స్లాట్లు భర్తీ కావడం కొసమెరుపు.ఇక మిగిలిన మూడుచోట్ల ముంబై చెన్నై కోల్ కతాల్లో మాత్రం వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
కాగా మే చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో మరోదఫా ఇంటర్వ్యూ తేదీలను (స్లాట్లు) అందుబాటులోకి తెస్తామని అమెరికా ప్రకటించింది.