అమెరికా : గురుద్వారాలో కాల్పుల కలకలం.. ఎవరి పని, భగ్గుమంటోన్న సిక్కు కమ్యూనిటీ..?

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్( Amritpal singh ) కోసం ముమ్మర గాలింపు చర్యలు జరుగుతుండటం, ఖలిస్తాన్ మద్ధతుదారులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో( California ) వున్న గురుద్వారాలో కాల్పుల కలకలం రేగింది.ఆదివారం శాక్రమెంటో కౌంటీ బ్రాడ్‌ షా రోడ్డులోని గురుద్వారా సాహిబ్‌లో( Gurudwara Sahib ) ఈ ఘటన జరిగింది.

 Us Shooting At Gurudwara In California Details, Us Shooting ,gurudwara ,californ-TeluguStop.com

కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో వీరిని తోటి భక్తులు, గురుద్వారా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.

గురుద్వారా ఆవరణలో జరిగిన గొడవ కాల్పులకు దారితీసినట్లు తెలిపారు.ఈ ఘటనకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న ఓ భారత సంతతి యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Telugu America, Amritpal Singh, Calinia, Countybradsha, Gurudwara, Gurudwara Sah

కాగా.అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ , కేంద్ర ప్రభుత్వాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఇతని వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.రోజులు గడుస్తున్నా అమృత్‌పాల్ ఆచూకీ దొరకకపోవడంతో సిక్కులకు పరమ పవిత్రమై అకల్‌తఖ్త్ జాతేదర్ స్పందించారు.

ఎక్కడున్నా సరే పోలీసులకు తక్షణం లొంగిపోవాలని అమృత్‌పాల్‌ను ఆయన కోరారు.

Telugu America, Amritpal Singh, Calinia, Countybradsha, Gurudwara, Gurudwara Sah

ఇదిలావుండగా.అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా మరణిస్తున్నారు.సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.

గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube