అమెరికా, చైనా మధ్య ఉప్పునిప్పులా ఉంది.రెండు దేశాలకు అసలు పొసగడం లేదు.
చాలా విషయాల్లో రెండు దేశాలకు చాలా గొడవలు ఉన్నాయి.కరోనా వైరస్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న విబేధాలను మరింతగా పెంచింది.
చైనా( China ) కరోనా వైరస్ ను విడుదల చేసిందని, వ్యూహన్ ల్యాబ్‌లో తయారుచేసి బయటకు లీక్ చేసిందని ఆమెరికా సంచలన ఆరోపణలు చేసింది.అలాగే అమెరికా( America ) ఆరోపణలను చైనా కూడా తిప్పికొట్టింది.
దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి.

అయితే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్( President Joe Biden ) బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత చైనా విషయంలో మార్పులు వచ్చాయి.చైనాతో అమెరికా కొంచెం సాన్నిహిత్యంతోనే ఉంటుంది.ఈ క్రమంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తొలిసారి చైనాలో పర్యటించారు.
బీజింగ్‌లో ఆయన పర్యటించారు.దీంతో ఐదేళ్లలో బీజింగ్‌లో పర్యటించిన తొలి అమెరికా అధికారి కూడా ఈయనే.ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆయన కీలక భేటీ నిర్వహించారు.

ఈ సమావేశంలో యూఎస్, చైనా మధ్య సంబంధాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.అయితే గత ఏడాది బలిలో జరిగిన సమావేశంలో జో బైడెన్, జిన్‌పింగ్ త్వరలో బ్లింకెన్‌ను సందర్శించడానికి అంగీకరించారు.
ఈ పర్యటన ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది.కానీ అమెరికా ఆకాశంలో చైనా గూఢాచారి బెలూన్ల అంశం తెరపైకి రావడంతో ఈ సమావేశం ఆలస్యం అయింది.
రాబోయే కొద్ది నెలల్లో జో బైడెన్, జిన్‌పింగ్ సమావేశం ఉండొచ్చని చెబుతున్నారు.ఈ సమావేశంతో అమెరికా, చైనా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి.