అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.ముక్కుసూటిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొన్నిసార్లు దుమారం రేపాయి.
అయినప్పటికీ రామస్వామికి మద్ధతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతున్నారు.తాజాగా తాను హిందువునని .తాను కర్మను, అదృష్టాన్ని నమ్ముతానని రామస్వామి చెప్పారు.శనివారం డైలీ సిగ్నల్ ఫ్లాట్‌ఫాం నిర్వహించిన ‘‘ ది ఫ్యామిలీ లీడర్’’( The Family Leader ) ఫోరమ్‌లో ఆయన పాల్గొన్నారు.
హిందూ – క్రైస్తవ మత బోధనల మధ్య సమాంతరాలను వివేక్ వివరించారు.
‘‘ తన విశ్వాసమే( Faith ) తనకు స్వేచ్ఛనిస్తుంది, తన విశ్వాసమే తనను ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారం వైపు నడిపింది.
నేను హిందువును, నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్ముతాను.దేవుడు మనలోని ప్రతి ఒక్కరినీ ఒక ప్రయోజనం కోసం ఇక్కడ వుంచుతాడని నేను నమ్ముతున్నాను.
నా విశ్వాసం . మన కర్తవ్యం, నైతిక బాధ్యత అని బోధిస్తుంది ’’ అని వివేక్ రామస్వామి వ్యాఖ్యానించారు.అలాగే తన ఎదుగుదల, కుటుంబం, వివాహం, తల్లిదండ్రుల గురించి కూడా ఆయన చెప్పాడు.

తాను సాంప్రదాయ కుటుంబంలో పెరిగానని.కుటుంబమే పునాది అని నా తల్లిదండ్రులు నేర్పించారని వివేక్ పేర్కొన్నారు.మీ తల్లిదండ్రులను గౌరవించాలని, వివాహం పవిత్రమైనదని.
( Marriage ) పెళ్లికి ముందు సంయమనం పాటించాలని, వ్యభిచారం తప్పని ఆయన చెప్పారు.దేవుని ముందు పెళ్లి చేసుకుని, భగవంతుడికి , మీ కుటుంబ సభ్యులకు ప్రమాణం చేస్తారని .అలాంటప్పుడు విడాకుల విషయంలో ఆలోచించాలని వివేక్ సూచించారు.ఆ భాగస్వామ్య విలువల కోసం తాను నిలబడతానని ఆయన పేర్కొన్నారు.

తాను క్రిస్టియన్ హైస్కూల్‌లో చదువుకున్నానని.బైబిల్ చదువుతానని ,( Bible ) నిజమైన దేవుడు ఒక్కడేనని వివేక్ వివరించారు.తల్లిదండ్రులను గౌరవించండి, అబద్ధం చెప్పకు, దొంగతనం, వ్యభిచారం చేయొద్దనే విషయాలను తాను అక్కడ నేర్చుకున్నానని ఆయన గుర్తుచేశారు.ఈ విలువులు హిందువులకో, క్రైస్తవులకో చెందినవి కావు .అవి నిజానికి దేవునివని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.