దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సదస్సుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో జో బైడెన్ రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయనకు కేంద్రమంత్రి వీకే సింగ్ స్వాగతం పలకనున్నారు.
కాగా బైడెన్ కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, పారా మిలటరీ దళాలు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ భద్రత నిర్వహించనున్నారు.మరోవైపు ఢిల్లీలో జో బైడెన్ మౌర్య షెర్టాన్ హోటల్ లో బస చేయనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా రెండు రోజుల పాటు జరిగే జీ20 సమ్మిట్ కు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో దేశ రాజధాని అంతటా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.







