అధ్యక్షుడిగా ఎయిర్‌‌ఫోర్స్ వన్‌లో ప్రయాణం.. థ్రిల్లింగ్‌గా వుందన్న బైడెన్..!!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అగ్రరాజ్యాధినేత అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌‌లో ప్రయాణించారు జో బైడెన్.

తన మనవలు, మనవరాళ్లను చూడటంతో పాటు వైట్ హౌస్‌లో కావాల్సినవి కొనుగోలు చేయడంలో సతీమణి జిల్‌కు సహకరించేందుకు బైడెన్ వాషింగ్టన్ నుంచి డెలావర్‌లోని తన ఇంటికి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణించారు.

అధ్యక్ష హోదాలో తాను ఈ విమానంలో ప్రయాణించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా బైడెన్ వ్యాఖ్యానించారు.అయితే ఈ విమానం, తాను 8 ఏళ్ళ పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్‌ మాదిరిగానే ఉన్నదని చెప్పారు.

కాకపోతే ఎయిర్‌ఫోర్స్ వన్‌ ఇంకాస్త బాగున్నట్లు బైడెన్‌ డెలావర్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.అయితే బైడెన్ గతంలోనూ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణించారు.2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడిగా వున్నప్పుడు ఆయనతో పాటు బైడెన్‌ దక్షిణాఫ్రికాకి ఈ విమానంలో ప్రయాణించారు.అయితే అమెరికాలో కరోనా ఉద్ధృతంగా ఉండటంతో సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) విమాన ప్రయాణాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.

దీని ప్రకారం.ఎవరైనా ప్రయాణాలు చేయదల్చుకుంటే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్న తరువాతే ప్రయాణించాలని స్పష్టం చేసింది.సెకండ్‌ డోస్‌ తీసుకున్న తరువాత కూడా ప్రయాణించడానికి రెండు వారాలు వెయిట్ చేయాలని సీడీసీ సూచించింది.

Advertisement

అయితే బైడెన్‌ మూడు వారాల క్రితమే రెండో విడత కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు.

ఎయిర్‌ఫోర్స్ వన్ ప్రత్యేకతలు:

బోయింగ్ 747-200 బీ తరగతికి చెందిన విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం ఎన్నో మార్పులు చేసి ప్రత్యేకంగా తీర్చి దిద్దారు.దీనినే ఎయిర్ ఫోర్స్ వన్‌ అంటారు.దుర్భేద్యమైన ఈ విమానాన్ని ఎగిరే వైట్ హౌస్ అని కూడా పిలుస్తారు.6 అంతస్తుల భవనమంత ఎత్తున ఈ విమానం అమెరికా రాజసానికి అద్దం పడుతున్నట్లుగా ఠీవీగా ఉంటుంది.

  • ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది.దాడి జరిగే అవకాశం ఉందని సమాచార అందితే చాలు మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా మారుతుంది.2001 సెప్టెంబరులో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడులు జరిగిన సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.ఈ సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్.అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్‌కి గాలిలోనే కమాండ్ సెంటర్‌ అయిపోయింది.
  • నాలుగు జెట్‌ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది
  • గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది.
  • ఒకేసారి 70 మంది వరకు ప్రయాణించవచ్చు.

  • గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత.
  • విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది.

    వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి.

  • అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్‌ గది, డైనింగ్‌ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్‌ సహా సకల సౌకర్యాలు ఉంటాయి.

    ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
    అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

  • ఇందులో వంటశాలు రెండు ఉంటాయి.వీటిలో 100 మందికి సరిపడా వంట ఒకేసారి చేయొచ్చు.

    Advertisement

    రెండు వంటశాలల్లో ఐదుగురు చీఫ్ ఛెఫ్‌లు, సహాయకులు పని చేస్తుంటారు

  • ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు.

ప్రస్తుతమున్న బోయింగ్ 747.1990లో జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ నుంచి ఇప్పటి డొనాల్డ్ ట్రంప్ వరకూ ఐదుగురు అమెరికా అధ్యక్షులకు సేవలందిస్తూ వస్తోంది.మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఈ విమానం త్వరలో రిటైర్ కాబోతోంది.

దీని స్థానాన్ని సరికొత్త మోడల్ అయిన 747-8 విమానం భర్తీ చేయబోతోంది.

తాజా వార్తలు