హోంలాండ్ సెక్యూరిటీపై బైడెన్ గురి: ఏరి కోరి భారతీయుడికి కీలక పదవి..!!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయ సమాజానికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.

ఇప్పటికే వీరి సంఖ్య 20ని దాటిపోయింది.

అయినప్పటీకి భారతీయుల సత్తాపై నమ్మకం వుంచిన ఆయన ముఖ్యమైన విభాగాలకు అధిపతులకు మనవారినే రంగంలోకి దించుతున్నారు.తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి తన జట్టులో చోటు కల్పించారు బైడెన్.

ఇండో అమెరికన్ డాక్టర్ ప్రితేష్ గాంధీని హోమ్‌లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా నియమిస్తూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.ఈ హోదాలో ప్రితేష్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా సలహాదారుగా పనిచేయనున్నారు.

బోర్డర్ హెల్త్, కరోనా వంటి మహమ్మారులు విరుచుకుపడినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వడంతో పాటు టూరిజం, విపత్తుల వంటి వాటిపై ప్రితేష్ గాంధీ పనిచేయనున్నారు.ఈ పదవిలో తాను సమర్థవంతంగా పనిచేస్తానని, తనకు ఈ అవకాశాన్ని కల్పించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రితేష్ గాంధీ స్పష్టం చేశారు.

Advertisement

ఆయన గతంలో పీపుల్స్ కమ్యూనిటీ క్లినిక్ లో అసోసియేట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.ఆస్టిన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన క్లినిక్స్ లో అది కూడా ఒకటి.

ప్రజారోగ్యంపై శిక్షణ, బోర్డు సర్టిఫికేట్‌ను పొందిన ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌గా గాంధీకి అమెరికాలో మంచి గుర్తింపు వుంది.పీపుల్స్ కమ్యూనిటీ క్లినిక్ దాదాపు 20,000 మందికి పైగా బీమా లేని వారికి వైద్య రక్షణను అందిస్తుంది.

ప్రితేష్ గాంధీ గతంలో ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ స్కాలర్‌ 2018కి ఎంపికయ్యారు.రాజకీయాలపై అభిరుచితో గాంధీ గతేడాది టెక్సాస్‌లోని 10వ కాంగ్రెషనల్ జిల్లాకు డెమొక్రాటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు.

కానీ దురదృష్టవశాత్తూ ఆయన ప్రైమరీలలోనే వెనుదిరగాల్సి వచ్చింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మరోవైపు జో బైడెన్ సర్కారు భారత సంతతి నేతలకు కీలక పదవులు ఇవ్వడంతో భారతీయ సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నయి.ఇక బైడెన్ జట్టులో కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి, వినయ్‌ రెడ్డి,వేదాంత్‌ పటేల్‌,వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ,సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితరులు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు