ఉక్రెయిన్ యుద్ధం : భారత్- అమెరికా ఆర్ధిక సంబంధాలపై యూఎస్ఐబీసీ చీఫ్‌ వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చాలా దేశాలపై ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చమురు సంక్షోభంతో ఎన్నో దేశాలు అల్లాడుతున్నాయి.

రాబోయే రోజుల్లో గ్యాస్, అమ్మోనియం నైట్రేట్, గోధుమలు, పొద్దు తిరుగుడు నూనె వంటి ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇవేకాకుండా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఎన్నో ప్రతికూలతలు ఎదురుకావొచ్చని నిపుణులు అంటున్నారు.

ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు.ఈ వార్ కారణంగా మనదేశంపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడుతుంది.

ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎదురవుతోన్న భౌగోళిక, రాజకీయ ప్రమాదాల నుంచి అమెరికా, భారత్‌లు తమ ఆర్ధిక సంబంధాలకు ‘నష్టపరిహారం’ అందించాలని యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు.భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి వున్న అమెరికన్ ఇన్వెస్టర్లకు స్ధిరత్వాన్ని అందించాలని ఆయన కోరారు.

Advertisement

ఇటీవల కేశప్.ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అమెరికన్ కంపెనీలు అకారణంగా ప్రయోజనం పొందాలని కోరుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.అనిశ్చిత, భౌగోళిక రాజకీయ సమయాలు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడిదారులు స్థిరత్వం కోసం చూస్తారని అతుల్ అన్నారు.

ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజాలు, చట్ట నియమాలు, అవకాశాలు సానుకూలంగా వున్న దేశాలను.తమను విశ్వసించే దేశాల కోసం వెతుకుతారని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రపంచాన్ని చూసినట్లయితే.భారత్, అమెరికాలు స్థిరత్వానికి యాంకర్‌గా వున్నాయన్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అందువల్ల రాబోయే వారాలు, నెలల్లో ఎన్నో జియోస్ట్రాటజిక్ రిస్క్‌లు వుండబోతున్నాయన్నారు.

Advertisement

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పుతిన్ సర్కార్‌పై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పతనంపైనా కేశప్ మాట్లాడారు.ఈ ఆంక్షలకు పరిణామాలు వుంటాయని.వీటిని ఎదుర్కోవాల్సి వుంటుందని అతుల్ హెచ్చరించారు.

ఇంధన ధరలు, వస్తువుల ధరలపై ఇది ప్రభావం చూపుతుందని.అయితే యుద్ధం ఇంకా ప్రారంభ దశలోనే వున్నందున అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు.

" autoplay>

తాజా వార్తలు