యూఎస్ కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్ సంచలన నిర్ణయం .. భారత సంతతి నేత శ్రీథానేదర్‌కు షాక్ తప్పదా ..?

యూఎస్ కాంగ్రెషనల్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు శ్రీథానేదర్‌కు ( Srithanedar )షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.యూఎస్ కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్.

 Us Congressional Black Caucus Lineup To Oust Indian American Congressman Thaneda-TeluguStop.com

మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో( Michigan’s 13th Congressional ) శ్రీథానేదర్‌‌ను తొలగించాలని పావులు కదుపుతోంది.యూఎస్ కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్ చైర్ స్టీవెన్ హార్స్‌ఫోర్డ్, మాజీ చైర్ జాయిస్ బీటీలు డెమొక్రాటిక్ ప్రైమరీలో థానేదర్‌కు కాకుండా ఆడమ్ హోలియర్‌కు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇది గణనీయమైన రాజకీయ మార్పును సూచిస్తుంది.మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్, నల్లజాతీయుల జనాభా గణనీయమైన స్థాయిలో వుంది.

ఇప్పటి వరకు ప్రతినిధుల సభలో నల్లజాతి ప్రతినిధి లేరు.

యూఎస్ ఆర్మీ నుంచి గవర్నర్ విట్మర్( Governor Whitmer ) కేబినెన్ వరకు ఆడమ్ హోలియర్ తన కమ్యూనిటీకి, దేశానికి సేవ చేస్తూ వస్తున్నారని హార్స్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అతను సమర్ధవంతమైన ప్రతినిధిగా కొనసాగిస్తాడని, ప్రజలను రాజకీయాలపై నిలబెడతారని, స్వేచ్ఛను కాపాడుకోవడం, మన హక్కుల కోసం పోరాడటం, ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించడం వంటి ప్రాముఖ్యతను ఆయన అర్ధం చేసుకున్నారని హార్స్‌ఫోర్డ్ చెప్పారు.

Telugu Detroit, Governor, Judy Chu, Marcy Kaptur, Ro Khanna, Robert Garcia, Srit

బ్లాక్ కాకస్ నిర్ణయాన్ని అసాధారణ పరిణామంగా పరిశీలకులు అభివర్ణించారు.2022లో రిపబ్లికన్ ప్రత్యర్ధిని 47 శాతం పాయింట్ల తేడాతో ఓడించిన శ్రీథానేదర్ .యూఎస్ కాంగ్రెస్‌లో మిచిగాన్ తరపున ప్రాతినిథ్యం వహించిన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.ఈ ప్రక్రియలో డెట్రాయిట్‌కు( Detroit ) ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లజాతి మిచిగాండర్ 67 ఏళ్ల రికార్డును ఆయన బద్ధలుకొట్టారు.

Telugu Detroit, Governor, Judy Chu, Marcy Kaptur, Ro Khanna, Robert Garcia, Srit

శ్రీథానేదర్ మొదటి త్రైమాసికంలో 5 మిలియన్ డాలర్లను సేకరించడంతో పాటు ప్రభావంతమైన ప్రజా ప్రతినిధులు, సంస్థల నుంచి 15కు పైగా ఆమోదాలను పొందాడు.ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ శాసనసభ్యుడు అమీ బెరాతో పాటు చట్టసభ సభ్యులు జూడీ చు, రాబర్ట్ గార్సియా, మార్సీ కప్తుర్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, టెడ్ లియు, సేత్ మ్యాగజైనర్, బ్రాడ్ షెర్మాన్, దిన టైటస్ ఆమోదాలను పొందారు.హ్యుమన్ రైట్స్ క్యాంపెయిన్, లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికా (లియునా), నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, మిచిగాన్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, న్యూటౌన్ యాక్షన్ అలయన్స్ కూడా అతనిని ఆమోదించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube