వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం పొట్ట చేతపట్టుకుని విదేశాలకు అడుగుపెట్టిన భారతీయులకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు దాదాపుగా ప్రతి దేశంలోనూ ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలు వున్నాయి.వీటికి తోడు మనదేశంలోని భాషల మాదిరే తెలుగు సంఘాలు, తమిళ సంఘాలు, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, కన్నడ సంఘాలు ప్రవాసీయులకు సేవలందిస్తున్నాయి.
దేశం కానీ దేశంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఈ సంఘాలు భారతీయులకు సాయం అందిస్తున్నాయి.ఈ క్రమంలో ఎన్ఆర్ఐల కోసం అమెరికాలో మరో సంస్థ అవతరించింది.
రెస్క్యూయింగ్ ఎవ్రీ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఓవర్సీస్ (REDIO) అనే సంస్థ… విదేశాల్లోని భారతీయ మిషన్లు, ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయడానికి గతేడాది ఏర్పాటు చేశారు.తాజాగా ఈ సంస్థ అమెరికాలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించింది.
భారత మాజీ దౌత్యవేత్త, జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ ములే. న్యూయార్క్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేమ్ భండారీతో కలిసి ‘‘ఆర్‌ఈడీఐవో’’ యూఎస్ చాప్టర్‌ను ప్రారంభించారు.
ఈ సంస్థకు అమెరికాలో ప్రేమ్ భండారీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఈ సందర్భంగా ములే మాట్లాడుతూ.ప్రస్తుతం వివిధ దేశాల్లో 30 మిలియన్లకు పైగా స్థిరపడిన భారతీయులు .విద్యారంగం, వ్యాపారం, మీడియా, కళలు, సంస్కృతి, రాజకీయాలు అనేక ఇతర రంగాలలో కీలకస్థానాల్లో వున్నారని చెప్పారు.ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్, ఉపాధి, ఇతర దేశాలలో రాజకీయ తిరుగుబాట్లు, చట్టపరమైన సమస్యలు, ఆస్తి వివాదాలు, వైవాహిక వైవాహిక సమస్యలతో సతమతమవుతూ వుంటారని.ఇలాంటి వారికి తమ సంస్థ అండగా వుంటుందని తెలిపారు.
ప్రతి దేశంలో సపోర్ట్ గ్రూపులను పొందాలనే లక్ష్యంతో .ఎన్ఆర్ఐలు, పీఐవోలు, ఓసీఐలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ములే చెప్పారు.ఇది దీర్ఘకాలంలో ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులకు ‘ఆర్‌ఈడీఐవో’’ ఆసరాగా వుంటుందని ఆయన ఆకాంక్షించారు.
ప్రేమ్ భండారీ మాట్లాడుతూ.ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు కొన్ని సమస్యల కారణంగా స్వదేశానికి చేరుకోలేని సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భారతీయ కమ్యూనిటీలోని సభ్యులు వారికున్న పరిచయాలు, నెట్‌వర్క్‌ల ద్వారా అనధికారికంగా సహాయం పొందేవారని భండారీ చెప్పారు.
REDIO ఇప్పుడు ఈ ప్రయత్నాలకు అధికారిక రూపాన్ని ఇస్తుందన్నారు.





 

