జో బైడెన్ కుటుంబంలోకి కొత్త సభ్యులు.. ‘‘కమాండర్’’కు స్వాగతం పలికిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు.

కమాండర్ అనే జర్మన్ షెపర్డ్ కుక్కపిల్లను బైడెన్ సతీమణి ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రజలకు పరిచయం చేశారు.

అలాగే మరో పిల్లి జనవరిలో వైట్‌హౌస్‌లోకి అడుగుపెడుతుందని ఆమె తెలిపారు.దీని రాకతో బైడెన్ కుటుంబానికి చెందిన మేజర్ అనే మరో జర్మన్ షెపర్డ్ కుక్కకు ఒంటరితనం తీరిపోనుంది.

అటు అధ్యక్షుడు జో బైడెన్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 3 నెలల మగ కుక్కపిల్ల ఫోటోను షేర్ చేశారు.‘‘వైట్‌హౌస్‌కి స్వాగతం.

కమాండర్’’ అంటూ ఓ వీడియోను పంచుకున్నారు .సదరు వీడియోలో బైడెన్ ఓ బంతిని గార్డెన్‌లోకి విసురుతూ.కుక్కతో ఆడుకుంటూ కనిపించారు.

Advertisement

కమాండర్ సెప్టెంబర్ 1న జన్మించగా.సోమవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌కు చేరుకుంది.

అధ్యక్షుడు జో బైడెన్ సోదరుడు జేమ్స్ బైడెన్- సారా బైడెన్ దంపతులు కమాండర్‌ను కానుకగా ఇచ్చారని జిల్ బైడెన్ అధికార ప్రతినిధి మైఖేల్ లారోసా తెలిపారు.కాగా.

జో బైడెన్ దంపతులకు అత్యంత ఇష్టమైన పెంపుడు కుక్క ‘‘ఛాంప్’’ (13) ఈ ఏడాది జూన్‌లో మరణించిన సంగతి తెలిసిందే.‘‘ తాము బాధలో వున్న రోజుల్లోనూ.

ఆనందంగా వున్న సమయంలోనూ ఛాంప్ మా వెంటే వుందని, మా భావోద్వేగాల్లోనూ భాగస్వామి అయ్యిందని’’ బైడెన్ దంపతులు గుర్తుచేసుకున్నారు.‘‘ఛాంప్ చిన్నతనంలో నావల్ అబ్జర్వేటరీ ముందు గార్డెన్‌లో గోల్ఫ్ బంతులను వెంబడించడం, డెలావర్‌లోని తమ ఇంటి ఆవరణలో మా మనవరాళ్లను పట్టుకోవడానికి పరిగెత్తేవాడని బైడెన్ దంపతులు ఉద్వేగానికి గురయ్యారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఛాంప్‌ను 2008లో అమెరికా ఉపాధ్యక్షుడిగా వున్న సమయంలో ఓ జంతువుల వ్యాపారి నుంచి బైడెన్ కొనుగోలు చేశారు.జంతు ప్రేమికుడైన ఆయనకు జర్మన్ షెపర్డ్ జాతికే చెందిన మరో కుక్క ‘‘ మేజర్’’ కూడా వుంది.ఛాంప్ మృతితో మేజర్ ఒంటరి అయ్యింది.

Advertisement

డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పరిపాలనలో వైట్ హౌస్‌‌లో పెంపుడు జంతువులకు స్థానం లేకుండా పోయింది.అయితే బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెంపుడు జంతువులకు శ్వేతసౌధంలో మళ్లీ స్థానం లభించింది.Plz Embed this video: https://twitter.com/POTUS/status/1473057147017744390.

తాజా వార్తలు