యూఎస్ - చైనా మధ్య అదనపు విమానాలొద్దు .. బైడెన్ యంత్రాంగానికి అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి

అమెరికా ఎయిర్‌లైన్స్‌( America Airlines )పై చైనా విధానాల నేపథ్యంలో యూఎస్ – చైనా మధ్య ఇకపై విమానాలను ఆమోదించడాన్ని నిలిపివేయాలని అగ్రరాజ్యానికి చెందిన పెద్ద ఎయిర్‌లైన్ సంస్థలు, ఏవియేషన్ యూనియన్‌లు బైడెన్ పరిపాలనా యంత్రాంగాన్ని కోరుతున్నాయి.చైనా తన మార్కెట్‌ను అమెరికాకు మూసివేసినట్లుగా ఎయిర్‌లైన్స్, యూనియన్లు గురువారం తెలిపాయి.

 Us Airlines Urge Biden Administration To Stop Approving Additional Flights Betwe-TeluguStop.com

కోవిడ్( Covid ) వ్యాప్తి నాటి క్యారియర్లు, అమెరికన్ కార్యకలాపాలు, ఎయిర్‌లైన్ సిబ్బందిని ఇప్పటికీ ప్రభావితం చేసేలా నిబంధనలు విధించబడ్డాయి.ఈ చర్యలు అమెరికా అవసరాన్ని ప్రదర్శించాయి.

యూఎస్‌కు రక్షణ కల్పించే విధానాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, విమానయాన కార్మికులు, పరిశ్రమలు, విమాన ప్రయాణీకులు వున్నారని ఆయా సంస్థలు విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రవాణా కార్యదర్శి పీట్ బుగ్గిగీగ్‌లకు రాసిన లేఖలో తెలిపారు.

-Telugu NRI

ఈ లేఖపై ఎయిర్‌లైన్స్ ఫర్ అమెరికా ట్రేడ్ గ్రూప్ సీఈవో, ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లోని సిబ్బందికి ప్రాతినిథ్యం వహిస్తున్న అలైట్ పైలట్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఫ్లైట్ అటెండెంట్లు సంతకం చేశారు.చైనా – అమెరికాల మధ్య విమానాల సంఖ్య( Flights Between China America ) కోవిడ్ ముందు నాటి కంటే తక్కువగా వున్నప్పటికీ .ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది.బైడెన్ అడ్మినిస్ట్రేషన్, చైనీస్ ఎయిర్‌లైన్స్ చేసే రౌండ్ ట్రిప్‌ల సంఖ్యను మార్చి 31వ తేదీ నుంచి 35 నుంచి 50కి పెంచింది.చైనా ఏవియేషన్ అథారిటీ .అమెరికా విమానాలను పెంచాలని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

-Telugu NRI

యూఎస్, చైనా ఎయిర్‌లైన్స్‌లు రష్యా గగనతలం గుండా తక్కువ మార్గాలను ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందుతాయని ఎయిర్‌లైన్స్ సంస్థలు పేర్కొన్నాయి.రష్యా( Russia ) రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి చైనీస్ విమానయాన సంస్థలు ప్రభుత్వ యాజమాన్యంలో వున్నందున ఆ దేశ ప్రభుత్వం నుంచి కొన్ని రక్షణలు పొందుతాయని యూఎస్ కారియర్లు పేర్కొన్నాయి.యూఎస్ , చైనా విమానయాన మార్కెట్‌కు సమాన ప్రాప్యత లేకుండా.

అమెరికన్ క్యారియర్లు చైనా విమానయాన సంస్థలకు విమానాలను కోల్పోతాయని పరిశ్రమ వర్గాలు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాయి.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య ఫ్లైట్ ఫ్రీక్వెన్సీల పెరుగుదలను నిరోధించడానికి యూఎస్ కారియర్లు ప్రయత్నిస్తున్నాయనే వార్తలపై పెట్టుబడిదారులు స్పందించడంతో చైనాలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ‘‘ఎయిర్ చైనా లిమిటెడ్’’( Air China Limited ) షేర్లు శుక్రవారం క్షీణించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube