మహారాణిలా బ్రతకాలనుకున్నా.. 18 ఏళ్లకే విడాకులు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రతి ఒక్కరూ పెళ్లి తర్వాత తమ జీవితం మరింత అందంగా మారుతుందని కలలు కంటారు.అయితే పెళ్లి తర్వాత జీవితం మనం ఊహించిన విధంగానే ఉంటుందని చెప్పలేం.

 Urvashi Dholkia Says People Took Advantage Her Vulenarable Situation After , Urv-TeluguStop.com

కొన్నిసార్లు కష్టాలే మనకు గమ్యం చూపించడంతో పాటు ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి అవసరమైన ధైర్యాన్ని కూడా అందిస్తాయి.బుల్లితెర నటి ఉర్వశి ధోకలియా( Urvashi Dholakia ) తన జీవితం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Divorce, Married, Tvactress-Movie

నిజ జీవితంలో ఎదురైన కష్టాల వల్లే తాను కెమెరా ముందు నటిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.నేను అందమైన జీవితాన్ని ఊహించుకున్నానని ప్రేమ, పెళ్లి కోసం కలలు కన్నానని అసలు పని చేయకూడదని అనుకున్నానని ఆమె వెల్లడించారు.ఒక మహారాణిలా బ్రతకాలని అనుకున్నానని కానీ అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేదని ఊర్వశి చెప్పుకొచ్చారు.నువ్వు స్వతంత్రంగా జీవించు కానీ పెళ్లి చేసుకోవాల్సిందే అని అమ్మ చెప్పారని ఊర్వశి కామెంట్లు చేశారు.

Telugu Bollywood, Divorce, Married, Tvactress-Movie

16 ఏళ్ల వయస్సులో నాకు పెళ్లి చేశారని ఆ సమయంలో లోకజ్ఞానం కూడా లేదని ఆమె అన్నారు.17 ఏళ్లకే కవల పిల్లలు పుట్టారని 18 ఏళ్లకే విడాకులు తీసుకున్నామని ఊర్వశి వెల్లడించారు.నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి బాధ్యతగా ఉండకపోవడమే విడాకులకు కారణమని ఆమె అన్నారు.అతడిలా నేను నా పిల్లలను అనాథలా వదిలేయలేనని ఊర్వశి( Urvashi Dholakia ) అభిప్రాయం వ్యక్తం చేశారు.నా తల్లీదండ్రులు అండగా నిలబడిన విధంగా మరెవరూ అండగా నిలబడలేదని ఊర్వశి పేర్కొన్నారు.19 ఏళ్ల వయస్సులో పని కోసం తిరిగానని కెరీర్ తొలినాళ్లలో నాకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.విడాకుల( Divorce ) తర్వాత ఇప్పటివరకు నా మాజీ భర్తను కలవలేదని ఊర్వశి కామెంట్లు చేశారు.ఊర్వశి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube