ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కృతి శెట్టి ఆ వెంటనే శ్యాంసింగరాయ్ మరియు బంగార్రాజు సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న విషయం తెలిసిందే.వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న కృతి శెట్టి ఏకంగా 10 సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది.
ఇప్పటికే ఆ పది సినిమాల్లో మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ కొన్ని వారాల గ్యాప్ లోనే వచ్చేసాయి.అందులో మొదటగా ది వారియర్ తర్వాత మాచర్ల నియోజకవర్గం తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.ఈ మూడు సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చాయి.
ఉప్పెన స్థాయిలో లేకున్నా బంగారు రాజు శ్యాం సింగరాయ్ సినిమాల స్థాయిలో ఉన్నా కూడా ఈ అమ్మడికి మరింతగా స్టార్డం దక్కేది.కానీ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
కనుక ఈ అమ్మడు పని అయిపోయినట్లే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి అంత నోరు వెళ్ల బెడుతున్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తర్వాత తన పారితోషికమును అమాంతం పెంచేసినట్లుగా ప్రకటించింది.మొన్నటి వరకు కోటి రూపాయల వరకు పారితోషికం అందుకున్న ఈమె దాదాపు 25 లక్షల రూపాయలను పెంచినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
రెమ్యూనరేషన్ విషయంలో ఒకేసారి ఇంతగా పెంచిన హీరోయిన్ కృతి శెట్టి మాత్రమే అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈమె సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతున్న కూడా ఈ స్థాయి పారితోషికం ఎలా అందుకుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసింది.మరో వైపు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తోంది.
ఇంతగా ఆఫర్లు వస్తున్నాయి కనుకనే పారితోషికంని భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది.