ఏప్రిల్ నెలలో ప్రముఖ బ్రాండ్ల నుండి ముఖ్యమైన స్మార్ట్ ఫోన్లు( Smartphones ) భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి.ఏ స్మార్ట్ ఫోన్ల వివరాలను తెలుసుకుందాం.
వన్ ప్లస్ నొర్డ్ CE 4 స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్( OnePlus Nord CE 4 ) 2024 ఏప్రిల్ 1వ తేదీ భారత మార్కెట్లో విడుదల కానుంది.ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 1.5k రిజల్యూషన్ డిస్ ప్లే తో వస్తోంది.ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3SoC ప్రాసెసర్ ద్వార అందించబడుతుంది.8GB RAM+ 256GB స్టోరేజ్ తో ఉండనుంది.ఈ ఫోన్ కు సంబంధించిన మిగతా ఫీచర్ల వివరాలు, ధర వివరాలు లాంచింగ్ సమయంలో వెలువడనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M55 స్మార్ట్ ఫోన్:
శాంసంగ్ యొక్క మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M55( Samsung Galaxy M55 ) స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 తో 8GB RAM+ 256GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.30000 వరకు ఉంటే అవకాశం ఉంది.
రియల్ మీ GT 5ప్రో స్మార్ట్ ఫోన్:
రియల్ మీ తన ఫ్లాగ్ షిప్ GT 5 ప్రో ను( Realme GT 5 Pro ) ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్, వేగన్ లెదర్ ప్యానెల్ ఉన్నాయి.5400mAh బ్యాటరీ సామర్థ్యంతో 100w ఫాస్ట్ ఛార్జింగ్, 50w వైర్ లెస్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
మోటో ఎడ్జ్ 50ప్రో స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ ఏప్రిల్ మూడవ తేదీ భారత మార్కెట్లో విడుదల అవ్వనుంది.6.7 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1.5k రిజల్యూషన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ పై పనిచేస్తుంది.
ఈ ప్రముఖ స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదల అవ్వనున్నాయి.
ఈ ఫోన్ లకు సంబంధించిన మిగతా వివరాలు ఫోన్లో లాంచింగ్ సమయంలో వెలవడనున్నాయి.