రామ్ చరణ్ భార్య ఉపాసన( Upasana ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.ఉపాసన అయోధ్య బాలరాముడిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించడం గమనార్హం.
ఉపాసన తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు.రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు ఉపాసన హాజరు కావడం గమనార్హం.
తాతయ్య, నాన్నమ్మలతో కలిసి ఉపాసన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మరోవైపు ఉపాసన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను( Yogi Adityanath ) అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి( Prathap C Reddy )తో పాటు కలుసుకున్నారు.
ఆ తర్వాత తాత లెగసీ గురించి తెలియజేసే ది అపోలో స్టోరీ అనే బుక్ ను ఆమె యోగి ఆదిత్యనాథ్ కు అందజేశారు.

త్వరలో అయోధ్యలో అపోలో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించడం గమనార్హం.అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు వాళ్లు ప్రకటించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఉపాసన అయోధ్యలో భక్తితో రాముడిని పూజిస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఉపాసన భక్తికి నెటిజన్లు ఫిదా అవుతుండటం గమనార్హం.
ఉపాసన రామ్ చరణ్ కు సైతం కెరీర్ పరంగా ఎంతో సపోర్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.ఉపాసన రామ్ చరణ్( Ram Charan ) జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఉపాసనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ఉపాసన బిజినెస్ లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.ఉపాసన తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.