తన చెల్లికి కాబోయే భర్తను పరిచయం చేసిన ఉపాసన.. అతనేవరో తెలుసా ?

ఉపాసన కొణిదెల.రామ్ చరణ్ సతీమణిగా కొణిదెల వారి ఇంటి కోడలిగా మనందరికీ సుపరిచితం.

ఉపాసన సోషల్ మీడియాలో విపరీతంగా ఆక్టివ్ గా ఉంటుంది అనే విషయం కూడా మనకు తెలిసిందే.అయితే ఈసారి సరికొత్త న్యూస్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసింది ఉపాసన.

ఆ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది అదేమిటంటే ఉపాసన చెల్లెలు అనుష్పల త్వరలో పెళ్లికూతురు కాబోతుంది.ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఉపాసనా తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఇక ఉపాసన చెల్లెలు అనుష్పల పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరా అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ జరుగుతుంది.అతడెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఉపాసన చెల్లి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు అతని పేరు ఆర్మాన్ ఇబ్రహీం.చిన్నప్పట్నుంచి చెన్నైలోనే పుట్టి అక్కడే పెరిగాడు.

ప్రముఖ వ్యాపారవేత్త కొడుకైన ఇబ్రహీం ఫార్ములా వన్ రేసర్ గా దూసుకుపోతున్నాడు.ఇదివరకే సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నారు ఉపాసన చెల్లి మరియు ఇబ్రహీం.

ఇక ఉపాసన తల్లిదండ్రులకు ఇద్దరమ్మాయిలు మరియు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.ఉపాసన తమ్ముడు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఫారెన్ లో పై చదువులు చదువుతున్నాడు అనుష్పల మాత్రం చదువులు పూర్తి చేసి అపోలో సంస్థలోనే ఒక టాప్ పొజిషన్ లో ఉంది.ఇక అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ప్రముఖ ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ అనే విషయం మనకు తెలిసిందే.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఉపాసన కుటుంబం మొత్తం కూడా హాస్పిటల్స్ లోనే అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే అనుష్పల మరియు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇక అతి త్వరలో ఉపాసన చెల్లెలు పెళ్లి సంబంధించిన డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారట.

Advertisement

కామినేని వారి ఇంటి పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఇక అనుష్కల ఇబ్రహీం పెళ్ళికి ఎంత వైభవంగా జరుగుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు