మెగా కోడలు ఉపాసన( Upasana ) తన వృత్తి పరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితానికి కావలసిన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.ఇలా ఒక వైపు బిజినెస్ వ్యవహారాలన్నిటిని చూసుకుంటూ ఉన్నటువంటి ఉపాసన ఫ్యామిలీతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అయితే ఇటీవల ఉపాసన తన తాతయ్య నాన్నమ్మలతో కలిసి మొదటిసారి అయోధ్య(Ayodhya) కు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.ఇలా మొదటిసారి అయోధ్యకు వెళ్ళినటువంటి ఈమె బాల రాముడిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.
ఇలా బాలరామయ్యను దర్శించుకున్న అనంతరం అయోధ్యలో ఈమె అపోలో హాస్పిటల్స్( Apollo Hospitals ) సేవలను కూడా ప్రారంభించారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.అయితే తాజాగా అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్న అనంతరం అందుకు సంబంధించినటువంటి వీడియోను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఉపాసన తన కోరిక తీరిందని, తన కల నెరవేరిందని తెలిపారు.ఇదొక అద్భుతమైనటువంటి అనుభూతి నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఓ గొప్ప ప్రయాణం అని తెలిపారు.ఉదయం నాలుగు గంటలకే స్వామివారిని దర్శించుకున్నామంటూ ఈమె అయోధ్య విషయాలను తెలియజేశారు.
ఇక ఈ వీడియోలో భాగంగా అయోధ్య రామ మందిరాన్ని చూపించడమే కాకుండా ఉపాసన ఎంతో సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఆలయానికి వెళ్లారు అంతేకాకుండా అక్కడ రోడ్ సైడ్ దొరికే ఫుడ్ కొనుగోలు చేయడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఉపాసన అయోధ్యలో అపోలో హాస్పిటల్ సేవలను ప్రారంభించిన సంగతి కూడా మనకు తెలిసిందే అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈమె కలిసి అపోలో సేవలు గురించి వివరించారు.