ఉపాసన గురించి తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మనస్తత్వం ఉన్న ఉపాసన.
రామ్ చరణ్ భార్యగా, కొణిదెల వారి కోడలిగా అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పరిచయాన్ని పెంచుకుంది.రామ్ చరణ్ అభిమానులను తన అభిమానులుగా మార్చుకుంది.
ఇక ఈమె అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు వహిస్తుంది.ఉపాసన తన హాస్పిటల్ తరపున ఎంతోమందికి సహాయం చేసింది.
చేస్తుంది కూడా.అలా మంచి మనసున్న ఉపాసన చిరంజీవికి తగ్గట్టుగా గౌరవము అందుకోవటంతో.
మెగా అభిమానులు మామకి తగ్గట్టు కోడలు అని ప్రశంసలు కూడా కురిపించారు.ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఉపాసన నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.మంచి మంచి హెల్త్ టిప్స్ తో పాటు అవసరమయ్యే విషయాలను బాగా పంచుకుంటుంది.ఇక తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన సినిమా అప్డేట్లను, ఆయన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.
ఇక ఉపాసన మొదటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఉపాసన.
ఇక గత ఏడాది తన అభిమానులకు గుడ్ న్యూస్ కూడా తెలిపింది.త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలిపి అందరినీ సంతోషంలో పెట్టింది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టా స్టోరీ లో ఒక వీడియో పంచుకుంది.అయితే ఆ వీడియో తనకు, రామ్ చరణ్ కి మధ్య రివేంజ్ అన్నట్లుగా వీడియోని క్రియేట్ చేశారు కొందరు.

అయితే ఆ వీడియోలో.ఓ ఈవెంట్ లో రామ్ చరణ్ పక్కన ఉపాసన కూర్చొని ఉండగా.వారి పక్కన మరో హీరో సాయి ధరంతేజ్ కూర్చొని ఉన్నాడు.దీంతో రామ్ చరణ్ వెంటనే ఉపాసనను పక్క సోఫా లో కూర్చోమని అనడంతో.ఉపాసన ఏమి అనకుండా సైలెంట్ గా లేచి పక్కన వెళ్లి కూర్చుంది.దాంతో ఆ తర్వాత ఉపాసన ఆ రివేంజ్ ను రాంచరణ్ పై తీర్చుకున్నట్లుగా కూడా మరో వీడియో ఎడిట్ చేశారు.

అదేంటంటే గతంలో కోవిడ్ సమయంలో రామ్ చరణ్ ఇంట్లో బట్టలు మిషన్ లో వేయటం, ఇంటిని క్లీన్ చేయటం, ఆ తర్వాత ఉపాసనకు కాఫీ తెచ్చి పెట్టడం వంటివి చేశాడు.దీంతో ఆ వీడియోను ఈ వీడియోకు రివేంజ్ గా జోడి చేయటంతో ఆ వీడియోను ఉపాసన రీపోస్టు చేస్తూ తెగ నవ్వుతూ కనిపించింది.ఆ వీడియో చూసిన తన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది.






