Upasana: అమెరికాలో ఉపాసన తీసుకున్న లగ్జరీ బంగ్లా గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన( Ram charan Upasana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా ఈ జంట అమెరికాలో ( America ) సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

 Upasana Rented Luxury Bungalow Los Angeles-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ ( RRR ) ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి చెర్రీ హాజరు కాగా చెర్రీ తో పాటు ఉపాసన కూడా అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగిసిన కూడా ఈ జంట అక్కడే తిరుగుతూ చక్కర్లు కొడుతున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్నప్పటి నుంచి మెగా కపుల్‌ ఎక్కువగా అమెరికాలోనే గడుపుతున్నారు.మార్చి 13న లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్‌ ప్రదానోత్సవ కార్యక్రమానికి భర్త చరణ్‌తో పాటు ఉపాసన కూడా పాల్గొన్ని సందడి చేసింది.

కాగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే.చెర్రీ ఉపాసన అక్కడే ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.

Telugu America, Los Angeles, Naatu Naatu, Oscar Award, Pregnant, Ram Charan, Tol

ఉపాసన లాస్‌ ఎంజిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను కొన్ని నెలల పాటు రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆమె గర్భవతిగా ఉన్న కారణంగా అక్కడ అన్ని విధాలుగా కంఫర్ట్‌ ఉండేందుకు, అలాగే హెల్త్‌ కేర్‌లో భాగంగా ఇల్లు తీసుకున్నారట.అమెరికా వెళ్లినప్పటి నుంచి చరణ్‌, ఉపాసనలు ఆ బంగ్లాలోనే ఉంటున్నారట.

ఇంకా కొన్ని రోజుల పాటు అదే ఇంట్లో ఉండనున్నట్టు తెలుస్తోంది.అంతే కాకుండా ఈ జంటకు సహాయకులుగా ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Telugu America, Los Angeles, Naatu Naatu, Oscar Award, Pregnant, Ram Charan, Tol

ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం ఆ ఇంట్లోనే పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది.అమెరికా వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన చిన్న పెట్టెలో దేవుడి ప్రతిమలకు పూజ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఉపాసన ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అన్న విషయం తెలిసిందే.ఇక మెగా వారసుడి కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube