మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) భార్యగానే కాక, బిజినెస్ ఉమెన్ గా కూడా ఉపాసన( Upasana ) చాలా పాపులర్ అయ్యారు.ఉపాసన రెగ్యులర్ గా పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు.
ఇలా ఈమె ఈ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.తాజాగా హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము( President Droupadi Murmu ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమానికి ఉపాసనకి కూడా ఆహ్వానం అందడం విశేషం అయితే ఉపాసన తన కుమార్తె క్లీన్ కార( Klin Kaara ) తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాసన ప్రసంగిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇలాంటి ఓ గొప్ప కార్యక్రమానికి తన కుమార్తెతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉంది.ఈ అవకాశం ఇచ్చినందుకు ఈమె కామేష్ దాజికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా తన ముద్దుల కుమార్తెను ఏకంగా రాష్ట్రపతికి పరిచయం చేయడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలపై మెగా అభిమానులు స్పందిస్తూ.
మెగా ప్రిన్సెస్ దర్శనం మాకు ఎప్పుడు వదిన మాకు ఎప్పుడు మీరు చూపిస్తారు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.