మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ చూసుకుంటోంది.
కేవలం రామ్ చరణ్ భార్య గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఫాలోయింగ్ నీ ఏర్పరుచుకుంది ఉపాసన.ఈమె హాస్పిటల్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సమయం దొరికినప్పుడల్లా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు అభిమానులకు హెల్త్ విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది.
అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది.
అలాగే ఈవెంట్లలో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది.మరి ముఖ్యంగా మూగజీవాల పరిరక్షణకూ పాటు పడుతుంటారు.
ఎక్కువగా ఉపాసన సోషల్ సర్వీస్ కార్యక్రమాలలో ముందు ఉంటుంది.కరోనా తర్వాత ఉపాసన ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసింది.
ఇప్పటికే ఎన్నో మంచి మంచి పనులు చేసి గొప్ప మనసున్న చాటుకున్న ఉపాసన తాజాగా మరొకసారి తన గొప్ప మనస్సును చాటుకుంది.ఆ విషయం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ అంతటా చర్చించుకుంటున్నారు.

ఉపాసన దాదాపుగా 150 ఓల్డ్ ఏజ్ హోమ్ మనకు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఒక ఫౌండేషన్ తో కలిసి ఉపాసన ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా వృద్ధుల అందరితో కలిసి సంతోషంగా గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో చేయగా ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.ఉపాసన అంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఒక సాధారణ వ్యక్తి లాగా ఆ వృద్ధుల మధ్యలో కూర్చుని వారితో కబుర్లు చెబుతూ ఎంతో సంతోషంగా ఉంది.
ఉపాసనకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.







