నేడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను( Holi Festival ) ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇలా హోలీ పండుగ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలను నుంచి మొదలుకొని సాధారణ ప్రేక్షకుల వరకు కూడా హోలీ పండుగను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హోలీ పండుగను పురస్కరించుకొని మెగా ఇంట్లో కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరిగాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన( Upasana ) సోషల్ మీడియా వేదిక చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఉపాసన ఇటీవల అమ్మగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిన తన కూతురు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క పండుగను కూడా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తన కుమార్తె క్లీన్ కార( Klin Kaara) పుట్టిన తర్వాత ఈ హోలీ రావడంతో మొదటి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

ఇందులో భాగంగా తన కూతురు ఫేసు, వీరి హోలీ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు కాకుండా హోలీ పండుగను పురస్కరించుకొని ఉపాసన ప్రత్యేకంగా తన కుమార్తెకు ఒక టీ షర్ట్ డిజైన్ చేయించారని తెలుస్తోంది.ఇందులో భాగంగా మై ఫస్ట్ హోలీ విత్ క్లిన్ కారా( My First Holi With Klin Kaara ) అంటూ ఉన్నటువంటి టీ షర్ట్ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ చిన్నారి గత ఏడాది జూన్ నెలలో జన్మించినప్పటికీ ఇప్పటివరకు తన ఫేస్ మాత్రమే రివిల్ చేయలేదు అయితే త్వరలోనే క్లీన్ కారను అందరికీ పరిచయం చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఇటీవల తన భర్త కూతురితో కలిసి ఈమె వైజాగ్ బీచ్ లో ఎంతో ఎంజాయ్ చేశారు అయితే ఇక్కడ మాత్రం తన కుమార్తె ఫేస్ కి ఎలాంటి ఎమోజిస్ పెట్టకుండా ఉపాసన ఆ ఫోటోలను షేర్ చేయడంతో త్వరలోనే తమ చిన్నారిని అందరికీ పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.మెగా లిటిల్ ప్రిన్సెస్ ను చూడటం కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.