మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా సినిమాకి మధ్య వచ్చే గ్యాప్ ని ఫ్యామిలీ కోసం బాగా వాడుకుంటాడు అని అందరూ అంటూ ఉంటారు.ఏమాత్రం అవకాశం చిక్కిన ఫారెన్ టూర్ వేయడం బాగా అలవాటు.
ఈ స్టార్ కి కుటుంబంతో ఏదో ఒక దేశానికి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతూ ఉంటారు.సంపాదించే డబ్బు కుటుంబానికి కొంత పెట్టుకుని మిగతాదంతా సర్వీస్ చేస్తాడు మహేష్ బాబు.
అలాగే తను కూడా రిలాక్స్ అవ్వడానికి చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తూ ఉంటారు.అయితే మహేష్ బాబు లాగా టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో ఫ్యామిలీ వెకేషన్స్ జరిపిన సందర్భాలు లేవు.
ఇక ఈ మధ్యకాలంలో మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు.
ఒక్కసారి రాజమౌళి కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యాక ఎగ్జిట్ ఎప్పుడు అనేది ఎవ్వరూ చెప్పలేరు.మహేష్ బాబు మామూలుగానే మూడు నాలుగు నెలల్లో రెండు ట్రిప్స్ వేస్తాడు.మరి రాజమౌళి సినిమా ఒప్పుకున్నాడు కాబట్టి ఇకపై ఈ ట్రిప్స్( Mahesh Babu Vacations ) ఉండబోతాయా అంటే అది అనుమానమే.
అందుకే ప్రస్తుతం అమెరికా టూర్( America Tour ) లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.అయితే చాలామంది తన ట్రిప్స్ పై ఒక కామెంట్ చేస్తూ ఉంటారు.
ఎవరైనా ఇండియా నుంచి బయట దేశాలకు అప్పుడప్పుడు ట్రీప్స్ వేసి రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ మహేష్ బాబు మాత్రం ఎప్పుడు ట్రిప్స్ తోనే ఉంటూ ఇండియాకి ఒక వెకేషన్ లాగ వస్తున్నాడు అని.ఈ కామెంట్ బట్టి చూస్తే సోషల్ మీడియాలో మహేష్ బాబు వెకేషన్స్ పై చాలా జలస్ కనిపిస్తుంది.
టాలీవుడ్ లో మరే హీరోకి కూడా ఇన్ని సార్లు టూర్లకి వెళ్లడం సాధ్యం కాదు.కానీ మహేష్ బాబు చాలా ప్లానింగ్ గా చేస్తూ ఉంటాడు.పైగా పిల్లలు కూడా స్కూల్స్ ఖాళీ దొరికితే ఫారెన్ టూర్స్ వెళ్లడానికే ప్రయారిటీ ఇస్తారట.అందుకే భార్య పిల్లలు కలిసి ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.ఒకవేళ మహేష్ బాబుకు ఏదైనా షెడ్యూల్ బిజీగా ఉంటే నమ్రత( Namrata Shirodkar ) పిల్లలతో బయటకు వెళ్ళిపోతుంది.ఏదో ఒక కంట్రీ కి వెళ్ళిపోయి నాలుగైదు రోజుల పాటు రిలాక్స్ అయి మళ్ళీ ఇండియాకు వస్తారు.
ఇది ఇప్పుడే కాదు చిన్నతనం నుంచి జరుగుతోంది.మహేష్ బాబు కూడా చిన్నతనం నుంచి తండ్రి షూటింగ్ కి వెళ్లి టైం కడుపుతో వచ్చేవాడట.
అదే అలవాటు ఇప్పటికే ఉంది.ఏదేమైనా ఇలా ఎంజాయ్ చేయడానికి పెట్టి పుట్టాలి.