కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న విషయం తెలిసిందే.ఈ లాక్ డౌన్ తో తల్లి దండ్రులు చనిపోయినా కూడా చివరి చూపు కు కూడా నోచుకోలేని దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి.
అయితే సామాన్యులకే ఇలాంటి పరిస్థితులు అనుకుంటున్నారేమో, సీఎం కి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.ఇంతకీ ఎవరా సీఎం అని అనుకుంటున్నారా.
ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.సోమవారం ఆదిత్యానాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు.
89 ఏళ్ల ఆనంద్ కాలేయ, మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందారు.
నిపుణులైన డాక్టర్లతో చికిత్స అందించారు.ఆదివారం రాత్రి నుంచి వెంటిలేటర్ పై శ్వాస తీసుకున్నారు.
ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది.ఫారెస్ట్ రేంజర్ గా పనిచేసిన ఆనంద్ 1991లో రిటైరై ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలోనే ఉంటున్నారు.
ఆదిత్యానాథ్ చిన్నతనంలోనే సన్యాసంపై మొగ్గు చూపినా ఆనంద్ పెద్దమనుసుతో అంగీకరించారు.అనారోగ్యం కారణం గా ఆయన సోమవారం మృతి చెందడం తో మంగళవారం స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆయన స్వగ్రామం లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

ఐతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని, తన తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని యోగి ఆదిత్యనాథ్ బాధపడ్డారు.ఈ మేరకు కుటుంబ సభ్యులకు సందేశం కూడా పంపినట్లు తెలుస్తుంది.మరోపక్క ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు తమ తరపున సానుభూతి తెలిపారు.ఐతే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.దానికి తోడు లాక్‌డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నానని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్లు సమాచారం.