హీరో కృష్ణ… తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక శకం ముగిసిపోయింది.అయన తోటి హీరోలు అయినా సీనియర్లు అందరు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు.
ఇక కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు మీడియాలో, సోషల్ మీడియా లో మహేష్ బాబు తండ్రి మరణం తో ఒంటరి వాడు అయ్యాడు అంటూ వార్తలు రాస్తూ, పోస్టులు పెడుతున్నారు.మహేష్ బాబు కి తల్లి ఇందిరా దేవి చనిపోయిన నెలకి తండ్రి చనిపోవడం నిజంగా బాధాకరం.
కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఒంటరి అయ్యింది మహేష్ బాబు కాదు.ఘట్టమనేని మృదుల.ఎవరు ఈ మృదుల అనుకుంటున్నారా ? ఆమె కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు భార్య మృదుల. రమేష్ భార్య అయినప్పటికి మృదుల ఏనాడు మీడియా ముందు కనిపించలేదు.
గొప్పింటి కోడలి దర్పం చూపించలేదు.ఆమె భర్త ఆరోగ్యపరమైన ఇబ్బందులతో ఎనిమిది నెలల క్రితం కన్ను మూస్తే ఆమె తన ఇద్దరి పిల్లలతో ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది.
భర్త పోయిన అటు అత్త, ఇటు మామ ఉన్నారన్న భరోసా ఉండేది.
ఇక మహేష్ బాబు ఎలాగూ మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు.కానీ పోయిన నెలలో ఇందిరా దేవి కన్ను మూసింది.ఇక ఇప్పుడు కృష్ణ వంతు వచ్చింది.
ఇద్దరు కన్ను మూయడం తో ఇప్పుడు భర్త, అత్త, మామ అందరు కోల్పోయి ఒంటరిగా మారింది.
ఇంకా ఆమె కు ఒక కుమారుడు జయ కృష్ణ మరియు కూతురు కూడా ఉన్నారు.
వారు ఇంకా సెటిల్ అయినట్టుగా కనిపించడం లేదు.ఇలా ప్రస్తుతం మృదుల ప్రపంచం మూగబోయింది.ఒక్క మహేష్ బాబు మాత్రమే ఇప్పుడు ఆమెకు అండగా నిలవాలి.రమేష్ బాబు పిలల్లకు ఇంకా వివాహాలు కూడా జరగలేదు.మహేష్ బాబు తో పాటు నమ్రత కూడా వారి కుటుంబం తో సఖ్యత కలిగి ఉంటుంది.