Australia Khalistan : భారత్ హెచ్చరికలు బేఖాతరు.. ఈసారి ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ రెఫరెండం

ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ఏళ్లుగా పోరాడుతోన్న వేర్పాటువాదులు ఇటీవల దూకుడు పెంచారు.సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఇటీవల కెనడాలో రెఫరెండం నిర్వహించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 Sfj Announces Next Round Of Khalistan Referendum For Separate Sikh Nation In Aus-TeluguStop.com

కొంతకాలం మౌనంగా వున్న ఖలిస్తానీ గ్రూపులు.ఇటీవల యాక్టీవ్ అవుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి, దాని గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారు.అక్కడితో ఆగకుండా ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా నానా రచ్చ చేశారు.

బందీ చోర్ దివాస్ సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు బ్రాంప్టన్, మిస్సిస్సాగా తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.విషయం తెలుసుకున్న ఇండో కెనడియన్లు కూడా భారత్‌కు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది.ఖలిస్తాన్‌కు అనుకూలంగా వుంటున్న వారిని కట్టడి చేయాలని కోరింది.

తాజాగా భారత్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ మరోసారి ఖలిస్తాన్ కోసం రెఫరెండానికి సిద్ధమైంది.అయితే ఈసారి కెనడాలో కాకుండా ఆస్ట్రేలియాలో కావడం గమనార్హం.

ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలో తదుపరి రౌండ్ ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు.

Telugu Australia, Brampton, Canada, Chandigarh, Mississau, Punjab, Sfjkhalistan,

మరోవైపు .చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేట్ అయిన పన్నూపై పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం, మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడంపై వేరు వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.వేర్పాటువాదం కారణంగా 2019 నుంచి భారతదేశంలో ఎస్‌ఎఫ్‌జీని నిషేధించారు.

పన్నూని తీవ్రవాదిగా గుర్తించారు.అయినప్పటికీ యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో స్థిరపడిన సిక్కు సంతతి ద్వారా పన్నూ ఖలిస్తాన్ కోసం ఉద్యమం చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube