Singer Rajsitharaman: టాప్ సింగర్ నుంచి ఇషా వాలంటీర్….ఆయన ఎందుకిలా ఐపోయాడు?

రాజ్ సీతారామన్( Singer Rajsitharaman ) అన్న పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన ఒక గాయకుడు.ఒకప్పుడు మన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కి( SP Balasubramanyam ) పోటీ ఇచ్చిన గాయకుడు.కానీ ఉన్నట్టుండి సినీ రంగం నుండి మాయమైపోయాడు.ఇప్పుడు సద్గురు నడుపుతున్న ఇషా సంస్థ లో వాలంటీర్ గా ఉన్నాడు.రాజ్ సీతారామన్ ఒక సుప్రసిద్ధ గాయకుడి స్థానం నుంచి ఇలా వాలంటీర్ గా మారటానికి గల కారణం ఏమిటో తెలుసా?

 Singer Rajsitharaman: టాప్ సింగర్ నుంచి ఇషా-TeluguStop.com

రాజ్ సీతారామన్ సొంత ఊరు తమిళనాడు లోని తిరునల్వేలి.( Tirunalveli ) ఇతను శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.ఇతని గురువు కే.వీ.నటరాజభాగవతార్. కేవలం 16 ఏళ్ళ వయసులోనే ప్రముఖ గాయకుడూ ఏసుదాస్( Yesudas ) బృందంలో చేరి పాటలు పాడడం మొదలుపెట్టాడు.

తరువాత కొంతకాలం బాలు గారి ట్రూపులో కూడా పాడాడు.తరువాత తానే సొంతగా శృతిలయ( Shrutilaya ) అనే ఆర్కెస్ట్రా ను ప్రారంభించాడు.కొన్నాళ్ళకు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు.

Telugu Agni Samadhi, Isha Volunteer, Raj Koti, Raj Seetaram, Rajsitharaman, Kris

ప్రముఖ దర్శకుడు సత్యంగారు “అగ్ని సమాధి”( Agni Samadhi ) అనే సినిమాలో రాజ్ సీతారామన్ తో పాడించారు.ఆ తరువాత దాసరి నారాయణ రావు గారు తన “జగన్” సినిమాలో( Jagan Movie ) అవకాశం ఇచ్చారు.ఇలా కొన్నాళ్ల పాటు సినిమా కెరీర్, స్టేజి కెరీర్ సమం గా సాగింది.

అప్పుడే రమేష్ నాయుడు సంగీతం వహించిన సూర్యచంద్ర అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గారికి అన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది.ఆ సమయంలో కృష్ణ గారికి అన్ని పాటలు బాలు గరే పడేవారు.

Telugu Agni Samadhi, Isha Volunteer, Raj Koti, Raj Seetaram, Rajsitharaman, Kris

కానీ వారి మధ్య ఆర్ధిక విషయంలో చిన్న మనస్పర్ధ వచ్చిన సమయంలో రాజ్ సీతారామన్ కృష్ణ గారి కంట పడ్డాడు.అప్పట్నుంచి కృష్ణ గారు సీతారాం కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.కానీ సంగీత దర్శకుడు రాజ్ కోటి, సీతారామ శాస్త్రి గారు కలిసి బాలు గారికి, కృష్ణ గారికి మధ్య రాజి చేయడంతో రాజ్ సీతారామన్ మాయమైపోయాడు.మళ్ళి ఎక్కడ, ఎప్పుడు కనపడలేదు.

ఈయన వివేకానంద కాలేజీ లో ఎకనామిక్స్ లో డిగ్రీ చేసి ఆ తరువాత ఏంబిఏ పూర్తి చేసి సొంతంగా కంపెనీ ప్రారంభించారు.ఇప్పుడు ఇషా సంస్థ లో( ISHA ) వాలంటీర్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube