టాలీవుడ్ లో కొన్ని రోజులపాటు కొంత మంది కమీడియన్స్ జోడి కొనసాగుతూ ఉంటుంది.నిన్న మొన్నటి వరకు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ ల జోడికున్న ప్రాముఖ్యత అంతా కాదు.
వీరిద్దరు కామెడీ సినిమాలో ఉందంటే సినిమా ఖచ్చితంగా హిట్టు అని భావించేవారు.అంతలా జనాలను ఆకట్టుకుంది వీరి కాంబినేషన్.
అయితే ఇలా ఒక కమెడియన్ జోడి అని ఏర్పడటం ఇదేమీ మొదటి సారి కాదు.తెలుగులో మొట్టమొదటిసారిగా ఇలా ఒక కమెడియన్స్ ఇద్దరు జోడి కట్టింది నాటి హాస్య నటులైన రేలంగి రమణారెడ్డిలది.
వీరిద్దరి జోడి కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది థియేటర్లలో.ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు అంటే జనాలకు చాలా ఆసక్తి ఉండేది.

ఇక రమణారెడ్డి రేలంగి లపై ఎప్పుడు జోకులు ఇండస్ట్రీలో తిరుగుతూ ఉండేవి.ఓసారి రేలంగి రమణారెడ్డి తో నిన్నిలా చూస్తుంటే దేశంలో ఉన్న గర్వంతా నీ దగ్గరే ఉన్నట్టుంది అంటూ పగలబడి నవ్వారట.దాంతో రమణారెడ్డి ఊరికే ఉంటారా అందుకు కౌంటర్గా నాకు ఇంత కరువు రావడానికి కారణం నువ్వే అంటూ ఇండైరెక్టుగా ఎత్తిపొడిచారట.దాంతో ఇద్దరు పగలబడి నవ్వడం మాత్రమే కాదు ఇదే జోక్ ఇండస్ట్రీ లో అంత అంటూ ఉండేవారట.
వాస్తవానికి రమణారెడ్డి, రేలంగి జంట అంతకు ముందు హాలీవుడ్ లో ఉన్న ఆశ జంట అయిన లారల్ హార్డీలను గుర్తు చేస్తూ ఉంటుంది.లారెన్ హాబీ కూడా బాలీవుడ్ లో ప్రముఖ హాస్య జోడి కావడం విశేషం.
వారి తరహా గెటప్ ల్లో తెలుగులో అంతస్తులు అనే సినిమాలో రమణారెడ్డి, రేలంగి కలిసి నటించారు.

ఇక రమణారెడ్డి కాస్త పెద్ద వయసు వ్యక్తి, రేలంగి చిన్నవాడు కావడంతో ఎక్కువగా మామ అల్లుళ్ళ పాత్రలో వీరు కనిపించేవారు.ఇక వీరి మధ్య నలిగిపోయే లేడీ కమెడియన్స్ గా రమాప్రభ, సూర్యకాంతం లాంటి హాస్య నటీమణులు ఉండేవారు.రమణారెడ్డి మరియు రేలంగిని అనుసరిస్తూ ఆ తర్వాత కాలంలో చాలా మంది కమీడియట్ జోడి కట్టారు.
తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఇలా జోడి హాస్య నటులకు మంచి డిమాండ్ ఉంది.







