ఘంటసాలది ఎంత గొప్ప మనసు.. తోడల్లుడు అజ్ఞాతంలోకి వెళ్తే.. ఏం చేశారో తెలుసా?

ఘంటసాల.ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.

 Untold Facts About Ghantasala Ghantasala, Ghantasala Venkateswara Rao, Tollywoo-TeluguStop.com

నాటి తరం ప్రేక్షకులకే కాదు నేటి తరం ప్రేక్షకులకు కూడా ఘంటసాల పాటలు వింటే ఎప్పుడు మనసు పులకరిస్తూ ఉంటుంది అని చెప్పాలి.ఇలా ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు అందించిన ఘంటసాల తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

అయితే ఘంటసాల గొప్ప సంగీత దర్శకుడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి అనడానికి ఎన్నో ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి.అలాంటి వాటిలో ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఘంటసాల వెంకటేశ్వరావు తోడల్లుడు ఆమంచి నరసింహారావు అప్పట్లో కరడుగట్టిన కమ్యూనిస్టు.ఆ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం ఎంతో ఉధృతంగా జరుగుతోంది.దీంతో పోలీసులు నిఘా పెరిగిపోవడంతో ఈ కమ్యూనిస్టు నాయకులు నిర్బంధం కూడా పెరిగిపోయింది.అంతేకాదు కనిపించిన చోటే కాల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

దీంతో కమ్యూనిస్టులు అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో కమ్యూనిస్టుల కుటుంబాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరుడుగట్టిన కమ్యూనిస్టుగా ఉన్న తోడల్లుడు నరసింహారావు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం తో ఇక ఆయన భార్య పిల్లలను మద్రాసులోని తన ఇంటికి తీసుకు వచ్చి ఆశ్రయమిచ్చారు ఘంటసాల.

Telugu Communist, Ghantasala, Music, Shiharao, Tollywood-Latest News - Telugu

అధికారులు ఊరుకుంటారా.ఈ విషయం తెలుసుకొని కమ్యూనిస్టు నరసింహారావు ఆచూకీ చెప్పాలని ఘంటసాలను అడిగారు.ఈ సమయంలో మా ఇంట్లో ఉన్నది మా వదినగారు ఆమె పిల్లలు బంధువులను మా ఇంట్లో ఉంచుకోకూడదు చట్టం ఏం లేదు అంటూ జవాబు ఇచ్చారట ఆయన.అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన దగ్గర నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లభించలేదు.ఆ సమయంలో సిఐడి అధికారులు కాస్త దిగివచ్చి ఘంటసాల గారు మీరు పేరు ప్రతిష్టలు కలవారు.

మీ పాటలంటే మాకు కూడా ఇష్టం.అందుకే ఇంత సహనంగా మిమ్మల్ని అడుగుతున్నామూ.

అన్ని తెలిసి ఆచూకి చెప్పకుండా దాచడం నేరం.మిమ్మల్ని అరెస్టు చేసే అవసరం రానివ్వకండి అంటూ సున్నితంగా హెచ్చరించారట అధికారులు.

అయిన ఘంటసాల భయపడలేదు ఇక చివరికి తోడల్లుడు నరసింహారావు జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ జీవితం గడిపెంతవరకు కూడా ఆయన కుటుంబం బాగోగులు మొత్తం ఘంటసాల చేసుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube