‘నా వెంట పడుతున్న చిన్నవాడెడమ్మా’ నుంచి విడుదలైన ‘నిలదీస్తుందా’ పాటకు అనూహ్య స్పందన..

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ కథతో వస్తున్న ఈ సినిమా లో భగవద్గీత, బైబిల్ ఖురాన్‌లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో వస్తున్న సినిమా నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా.

 Unpredictable Response To The Song 'niladishdada' Released From 'na Venta Padutu-TeluguStop.com

తమ సినిమాలో అందమైన పవిత్రమైన ప్రేమను చూపించడం జరిగింది అన్నారు చిత్ర దర్శకులు వెంక‌ట్ వందెల.ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు 19 న విడుదల కానుంది.

తాజాగా ఇందులోంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్.నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతాన్ని హేమచంద్ర పాడగా.

డా భవ్య దీప్తి రెడ్డి రచించారు.

నిలదీస్తుందా నీడే తానే ఎవ్వ రని ప్రశ్నిస్తుందా ప్రశ్నను బదులే వెతికేస్తుందా కన్నే చూపుని ఎక్కడని విడదీస్తుందా నీటిని చినుకే ఏమో ఎంత దూరుం ఉన్నా నాలో నిన్ను చూస్తూ ఉన్నా తిరిగే దారి కూడా అలిసిపోయి నన్ను చేరుతుంది నీకై వేచి ఉన్న ప్రాణం విడిగా ఉండనంది సత్యం వేదన వరదలాగా కంటితడి చెంప నిమురుతుంది ఏమవను నీవేలేక నేనేమైపోతాను గడిచేనా కాలమే నీ పిలుపే ఇక వినబడకుంటే మనసా ఇక ఊపిరాగే చీకటి మబ్బులన్నీ దాటి వెలిగే పౌర్ణమల్లే తోడే చెలియా ఒక్కసారి నన్నే చేరగ రావే ఓఓఓ .సఖియా తెరిచి చూడు ఎదనే మదిలో ఉని ప్రేమ చూడే నాలో ఊపిరల్లే నువ్వే చేరువ కావే ఓఓఓ .

న‌టీన‌టులు:

తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube