సాధారణంగా ఉద్యోగులకు ఒకటి లేదా రెండు రోజుల పాటు పెయిడ్ లీవ్స్‌ను కంపెనీలు అందిస్తాయి.అంటే సెలవు పెట్టిన రోజుల్లో కూడా డబ్బులు చెల్లిస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఈ లీవ్స్ తక్కువగానే ఉంటాయి.అయితే తాజాగా ఒక ప్రైవేట్ సంస్థ కనీవినీ ఎరుగని రీతిలో పెయిడ్ లీవ్స్ ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన మీషో తాజాగా తమ ఉద్యోగులకు ఏకంగా 365 రోజులు పాటు పెయిడ్ లీవ్స్ ప్రకటించింది.అంటే ఒక సంవత్సరం పాటు సెలవులు తీసుకున్నా కంపెనీ డబ్బులు అందిస్తుంది.
అయితే తాము నష్టపోయినా పర్లేదు కానీ ఉద్యోగుల భద్రత, సంక్షేమమే తమ ధ్యేయమని ఈ కంపెనీ చెబుతుండటం ఇప్పుడు అందరినీ ఫిదా చేస్తోంది.
ఉద్యోగుల కోసం మీషో కంపెనీ ‘మీకేర్ (MeeCARE)’ అనే ప్రోగ్రామ్‌ని తాజాగా లాంచ్ చేసింది.
ఈ ప్రోగ్రామ్ కింద ఉద్యోగులందరికీ 1 ఇయర్ పెయిడ్ లీవ్స్ ఫెసిలిటీ వర్తిస్తుంది.ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా వారి కుటుంబంలోని ఎవరైనా జబ్బున పడినా చెల్లింపుతో కూడిన సెలవులను ఈ కంపెనీ అందజేస్తుంది.
అయితే ఉద్యోగి అనారోగ్యం బారిన పడి సెలవు తీసుకుంటే వారికి 100% శాలరీని కంపెనీ చెల్లిస్తుంది.అదే వారి కుటుంబంలోని వారు జబ్బున పడితే మూడు నెలల వరకే సెలవులు తీసుకోవాలి.
ఈ సెలవులకు 25% శాలరీ చెల్లిస్తుంది.తరచూ ఆసుపత్రికి వెళ్లే వారు కూడా ఒక సంవత్సరం పాటు సెలవు తీసుకోవచ్చు.
అంతేకాదు, పర్సనల్ గోల్స్ నెరవేర్చుకోవాలనుకొనేవారు కూడా లీవ్ తీసుకోవచ్చట.అయితే ఎవరైతే మెడికల్ లీవ్ కాకుండా ఇతర కారణాల వల్ల సెలవు తీసుకుంటారో వారికి మాత్రం పెయిడ్ లీవ్స్ కంపెనీ అందించదు.
అంటే కంపెనీ అన్‌లిమిటెడ్ వెల్‌నెస్ పాలసీ మాత్రమే పరిచయం చేసినట్లు స్పష్టమవుతోంది.

ఈ బెంగళూరు ఆధారిత కంపెనీలో 2000 మంది ఎంప్లాయిస్ వర్క్ చేస్తున్నారు.2021 ఏప్రిల్‌లో ఈ సంస్థ మార్కెట్ వ్యాల్యూ 1 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.దీంతో వంద కోట్ల డాలర్లు మార్కెట్ వ్యాల్యూ ఉన్న యూనికార్న్‌ల లిస్టులో మీషో చోటు సంపాదించుకుంది.








