ఇద్దరు లెజెండ్స్ మధ్య గొడవ.. మరో ఇద్దరు లెజెండ్స్ ని ఇండస్ట్రీకి అందించింది.. ఈ స్టోరీ మీకు తెలుసా?

సాధారణంగా రాజకీయాల్లో రెండు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి అన్నది అందరికి తెలిసిన విషయమే అలాగే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు సినీ ప్రముఖుల మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి.ఇలాంటి గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.

 Unknown Fight Between Two Legends, K .vishwanadh, Veturi Sundara Murthi, Tollyw-TeluguStop.com

ఇక అప్పట్లో సంగీత దర్శకుడు వేటూరి, కళాతపస్వి కె.విశ్వనాథ్ మధ్య కూడా ఇక ఇలాంటి విభేదాలు వచ్చాయి.

అప్పట్లో ఇండస్ట్రీలో ఈ విభేదాలు సంచలనం గా మారిపోయాయి అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

సాధారణంగా కళాతపస్వి కె.

విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సంగీత భరిత మైన సినిమాలను తెరకెక్కించి బ్లాక్బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు ఆయన.ఇక అప్పటి కాలంలో అటు సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు వేటూరి.శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం లాంటి సినిమాలు కళాతపస్వి దర్శకత్వంలో వేటూరి సంగీతం లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సాగర సంగమం తర్వాత వేటూరి కె విశ్వనాథ్ మధ్య విభేదాలు వచ్చాయి.దీంతో ఇక వేటూరి విశ్వనాథ్ సినిమాలకు పని చేయడం మానేశారు.

Telugu Vishwanadh, Legends, Swati Mutyam, Tollywwod, Veturisundara-Latest News -

తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాకు ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు.ఇదే సినిమాలో మనసు పలికే పాటను కొత్త వాడైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రికీ అవకాశమిచ్చారు.కె.విశ్వనాథ్ సినిమాలో ఆయన పాట నచ్చడంతో ఇక ఆ తర్వాత ఇక సిరివెన్నెల అనే సినిమాలో పూర్తి పాటలు సీతారామశాస్త్రికీ రాసే అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత సిరివెన్నెల సినిమా సూపర్ హిట్ అవ్వడం సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

ఆ తర్వాత చాలా కాలానికి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వరాభిషేకం లో వేటూరి సిరివెన్నెల కలిసి సాహిత్యం అందించారు ఇక ఈ సినిమాలో పాటలు రామజోగయ్య శాస్త్రి కూడా అందించడం గమనార్హం.ఇలా వేటూరి కె.విశ్వనాథ్ మధ్య ఉన్న విభేదాలు చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రామజోగయ్య శాస్త్రి లాంటి వారిని పరిచయం చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube