హీరోయిన్ ని మార్చమని అడిగిన రాజేంద్ర ప్రసాద్.. ఏకంగా హీరోనే పీకేసిన దర్శకుడు

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. ఇదేదో రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పేరు అనుకుంటే అది పొరపాటే.

 Unknown Facts About Sri Kanaka Mahalakshmi Recording Dance Troupe, Sri Kanaka M-TeluguStop.com

వంశీకి హిట్ ఇచ్చిన సినిమాల్లో ఇది ఒకటి.ఇంత పెద్ద పేరు పెట్టి హిట్టు కొట్టడం అనేది కేవలం దర్శకుడు వంశీకి మాత్రమే చెల్లింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానా అని అనుకుంటున్నారు కదా ? విషయంలోకి వెళ్దాం పదండి.
వాస్తవానికి ఈ సినిమా కోసం మొదటగా అనుకున్న హీరో, హీరోయిన్స్ వేరు.

ఆ మధ్యకాలంలో వంశీ సినిమా తీస్తున్నాడు అంటే చాలు అందరూ హీరో రాజేంద్రప్రసాద్ అని ఫిక్స్ అయ్యేవారు.ఈ సినిమాకి కూడా మొదట రాజేంద్రప్రసాద్ ని హీరో అనుకున్నాడు వంశీ.

అలాగే హీరోయిన్ భానుప్రియ చెల్లి అయిన శాంతి ప్రియను ఫిక్స్ చేశాడు.కానీ ఎందుకో గాని ఈ రాజేంద్రప్రసాద్ కి శాంతి ప్రియ నచ్చలేదు ఏది ఏమైనా సరే హీరోయిన్ మార్చాల్సిందే అంటూ పట్టు పట్టాడు.

అందుకు వంశీ సిద్ధంగా లేడు ఎందుకంటే భానుప్రియ సెంటిమెంటు ఎలాగూ ఉండనే ఉంటుంది.

Telugu Rajendra Prasad-Movie

దాంతో సీరియస్ గా ఆలోచించిన వంశీ హీరోని పీకి పారిస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చాడు ఆనుకున్నదే తరవుగా నరేష్ ని హీరోగా చేయాలని భావించాడు ఒక్క ఫోన్ కొట్టగానే నరేష్ ఇంట్లో వాలిపోయాడు.ఇంట్లో లాగా అప్పుడు ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దర్శకుడు ఏం చేస్తే అదే అన్నట్టుగా ఉండేది.సినిమాలకు ఒక స్వర్ణ యుగం లాంటిది అందుకే నరేష్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.

అయితే నరేష్ పక్కన శాంతి ప్రియనీ కాకుండా కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించాడు.అలా ఒక హీరోయిన్ కోసం మొదలైన పంచాయితీ ఏకంగా హీరోని పీకేసే దాకా వచ్చింది.

ఇక ఈ సినిమాకి ఈ సంగీతం ఇళయరాజా అందించగా అదొక మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది.ఇక హీరోయిన్ గా కోడంబాకం రైల్వే స్టేషన్ గోడ మీద చూసిన సంసారం అదుమిన్ సారం అనే సినిమా పోస్టర్లో కనిపించిన వసంత అనే పాత్ర చేసిన అమ్మాయిని చూసి ముచ్చటపడి ఆమెనే హీరోయిన్ గా పెట్టాడు.

మొత్తానికి ఈ సినిమా మంచి హిట్ చిత్రంగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube