తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా పోటీపడి నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకున్న విషయం ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా హీరోయిన్లు కూడా సినిమాల్లో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోవడం కోసం వాళ్ల క్యారెక్టర్ పరిధిమేరకు నటిస్తూ ఆ క్యారెక్టర్ లో జీవిస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ అంటే సాంగ్స్ కు మాత్రమే పరిమితం అయ్యేది అనే వారు కానీ ఇప్పుడు సినిమాలో వాళ్ల క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే హీరోయిన్లు నటించడానికి ఇష్టపడుతున్నారు.

అలాంటి వారిలో సమంత ఒకరు ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారని చెప్పాలి సినిమా లో ఉన్న అన్ని పాటలు జనాల అందరిని ఆకట్టుకున్నాయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో సమంత వెనుదిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది అయితే సమంత ఇండస్ట్రీకి రాకముందు కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న జాబులు కూడా చేస్తూ ఉండేది అయితే తనలోని నటిని గుర్తించింది మాత్రం సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయిన రవి వర్మ అనే చెప్పాలి ఆయనే సమంత చేత మొదటగా నటింపచేశారు.

తెలుగులో నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుందిఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇదే కాకుండా ప్రత్యూష అనే ఒక సంస్థ ద్వారా సమంత చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తనే స్వయంగా ఖర్చులను భరిస్తూ ట్రీట్మెంట్ చేయిస్తుంది అలా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు కొంతమేరకు ప్రత్యూష అనే సంస్థ ద్వారా సేవ చేయడానికి వినియోగిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు అలాగే తోటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు సమంత.

తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది అలాగే ప్రస్తుతం కరోనా వల్ల లాక్ డౌన్ అయి థియేటర్లు బంద్ అవడంతో చాలా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఓ టి టి ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నారు అనే చెప్పాలి అయితే నాగచైతన్య కూడా ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన స్టోరీస్ సెలక్షన్ లో సమంత చాలా హెల్ప్ చేస్తుందనే విషయం తెలుస్తుంది ఎందుకంటే నాగ చైతన్య చేసే సినిమాలు చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాయి అంతకు ముందు ఏ సినిమా పడితే ఆ సినిమా చేసిన నాగ చైతన్య ప్రస్తుతం సమంత ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం మజిలీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో సమంత తన మెచ్యూరిటీ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల అందరిని ఆకట్టుకుంది అనే చెప్పాలి
.